లోకల్‌గానే కొందాం!

ABN , First Publish Date - 2020-10-18T09:04:08+05:30 IST

లోకల్‌గానే కొందాం!

లోకల్‌గానే కొందాం!

అధికార పార్టీ నేతల ఒత్తిళ్లు 

పశు కొనుగోలు పథకంపై కొత్త ప్రతిపాదన

మార్గదర్శకాల సవరణకు సిద్ధం


అమరావతి, అక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి): వైఎస్సార్‌ చేయూత, ఆసరా పథకాల కింద  గ్రామీణ మహిళలకు ఇవ్వదలిచిన పాడి పశువులను అధికార పార్టీ నేతల ఒత్తిళ్లతో మన రాష్ట్రంలోనే కొనుగోలు చేయాలని ప్రభుత్వం ప్రతిపాదించినట్లు సమాచారం. ఇతర రాష్ట్రాల నుంచి తెచ్చే పశువులకు సంబంధించి.. వాటి ఆరోగ్యం, పాల ఉత్పత్తిపై  లబ్ధిదారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారన్నది అధికార పార్టీ నేతల మాట!. అయితే.. చేయూత, ఆసరా పథకాల కింద పశువులను ఇతర రాష్ట్రాల నుంచే కొనుగోలు చేయాలని ప్రభుత్వం ఇప్పటికే మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ మేరకు పశువుల రవాణాకు ఈ-టెండర్లు పిలవాలని పశుసంవర్థకశాఖ నిర్ణయించింది. స్థానికంగానే కొనుగోలు చేసే విధానం వల్ల అవకతవకలు జరిగే అవకాశాలున్నాయని అధికారులు సంకోచించి, సమీప రాష్ట్రాల్లో కొనుగోలుకు అనుమతించారు. కానీ లబ్ధిదారులు ఇతర రాష్ట్రాల  పశువులు తెచ్చుకునేందుకు పెద్దగా ఆసక్తి చూపడం లేదని అధికార పార్టీ నేతలు ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఇప్పటికే ఇచ్చిన మార్గదర్శకాలను సవరించే ప్రతిపాదన సిద్ధం చేసినట్లు సమాచారం.

Updated Date - 2020-10-18T09:04:08+05:30 IST