ఇంటివాడు కానున్న చాహల్‌

ABN , First Publish Date - 2020-08-09T09:14:40+05:30 IST

టీమిండియా స్పిన్నర్‌ యజ్వేంద్ర చాహల్‌ శుభవార్త చెప్పాడు. లాక్‌డౌన్‌ సమయంలో తనకు నచ్చిన అమ్మాయితో లాకైనట్టు తెలిపాడు..

ఇంటివాడు కానున్న చాహల్‌

న్యూఢిల్లీ: టీమిండియా స్పిన్నర్‌ యజ్వేంద్ర చాహల్‌ శుభవార్త చెప్పాడు. లాక్‌డౌన్‌ సమయంలో తనకు నచ్చిన అమ్మాయితో లాకైనట్టు తెలిపాడు. కొరియోగ్రాఫర్‌ ధనశ్రీ వర్మతో ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్నట్టు ప్రకటించాడు. ‘మా కుటుంబాలతోపాటు మేమూ సరే అనేశాం’ అని ధనశ్రీతో కలిసి దిగిన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశాడు. ధనశ్రీ కొరియోగ్రాఫరే కాకుండా డాక్టర్‌, యూట్యూబర్‌ కూడా. ఈ సందర్భంగా చాహల్‌కు టీమిండియా ప్లేయర్లు విరాట్‌ కోహ్లీ, ధవన్‌, భువనేశ్వర్‌ కుమార్‌తోపాటు ఫీల్డింగ్‌ కోచ్‌ శ్రీధర్‌ తదితరులు శుభాకాంక్షలు తెలిపారు.

Updated Date - 2020-08-09T09:14:40+05:30 IST