ఆవులింతలు-గుండెపోటు

ABN , First Publish Date - 2022-09-27T19:36:58+05:30 IST

ఆవులింతలు నిద్రలేమికి సంకేతాలు. కానీ కంటి నిండా నిద్ర పోయినా, ఎటువంటి అలసటకు గురయ్యే పనులూ చేయకపోయినా

ఆవులింతలు-గుండెపోటు

ఆవులింతలు నిద్రలేమికి సంకేతాలు. కానీ కంటి నిండా నిద్ర పోయినా, ఎటువంటి అలసటకు గురయ్యే పనులూ చేయకపోయినా పదే పదే ఆవులింతలు వస్తున్నాయంటే గుండె సమస్యగా భావించాలి. 


ఆవులింతలకు కచ్చితమైన కారణాన్ని వైద్యశాస్త్రం ఇంతవరకూ కనిపెట్టలేకపోయింది. అయితే మెదడుకు ప్రసరించే రక్తంలో సరిపడా ఆక్సిజన్‌ను కలిసేలా చేసి, మెదడును చల్లబరచడం కోసమే ఆవులింతలు వస్తూ ఉంటాయని పలు అధ్యయనాల్లో తేలింది. అయితే విపరీతమైన ఆవులింతలకూ మెదడు దిగువ నుంచి గుండె, ఉదరాలను కలిపే వేగస్‌ నాడికీ సంబంధం ఉంటుంది. గుండె చుట్టూరా రక్తస్రావం జరిగిన సందర్భాల్లో కొందర్లో విపరీతంగా ఆవులింతలు వస్తూ ఉంటాయి. ఇదే రిఫ్లెక్స్‌ చర్య గుండెపోటులోనూ కనిపిస్తుంది. గుండెపోటుకు గురయ్యే ముందు, తర్వాత విపరీతమైన ఆవులింతలు వస్తాయని పలు అధ్యయనాల్లో వెల్లడైంది. ఈ లక్షణంతో పాటు ముఖంలో సగభాగం ఓ వైపుకు జారడం, చేయి బలహీనపడడం, మాట్లాడడంలో తడబాటు లాంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి. మెదడులో గడ్డలు, మూర్ఛ, మల్టిపుల్‌ స్క్లెరోసిస్‌, లివర్‌ ఫెయిల్యూర్‌ మొదలైన రుగ్మతల్లో కూడా విపరీతమైన ఆవులింతలు వస్తాయి. కాబట్టి ఆవులింతల మీద ఓ కన్నేసి ఉంచాలంటున్నారు పరిశోధకులు.

Updated Date - 2022-09-27T19:36:58+05:30 IST