hate speech: హిందూమహాసభలో మళ్లీ వివాదాస్పద వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2022-09-19T16:29:43+05:30 IST

వివాదాస్పద బోధకుడు(controversial preacher) యతి నర్సింహానంద సరస్వతిపై(Yati Narsinghanand Saraswati) అలీఘడ్ పోలీసులు తాజాగా కేసు...

hate speech: హిందూమహాసభలో మళ్లీ వివాదాస్పద వ్యాఖ్యలు

మదరసాలను పేల్చివేయాలని పిలుపు... యతి నర్సింహానంద్‌పై కేసు

అలీఘడ్ (ఉత్తరప్రదేశ్): వివాదాస్పద బోధకుడు(controversial preacher) యతి నర్సింహానంద సరస్వతిపై(Yati Narsinghanand Saraswati) అలీఘడ్ పోలీసులు తాజాగా కేసు(Police case) నమోదు చేశారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అలీఘడ్ నగరంలో ఆదివారం జరిగిన హిందూమహాసభ కార్యక్రమంలో యతి నర్సింగానంద సరస్వతి విద్వేషపూరిత వివాదాస్పద వ్యాఖ్యలు(hate speech) చేశారు. గన్‌పౌడర్ ఉపయోగించి మదర్సాలు, అలీఘర్ ముస్లిం విశ్వవిద్యాలయాన్ని(madrasas and the Aligarh Muslim University) కూల్చివేయాలని యతి నర్సింగానంద పిలుపునిచ్చారు.తాజాగా యూపీలో సాగుతున్న సర్వేలో గుర్తింపులేని మదరసాలను చైనా దేశంలో లాగా గన్ పౌడరుతో పేల్చివేయాలని యతి నర్సింగానంద పిలుపునిచ్చారు. 


మదరసాల్లోని విద్యార్థులకు మతపిచ్చి వైరస్ సోకిందని, మతపిచ్చిని వారి మెదళ్ల నుంచి తొలగించాలని ఆయన కోరారు. మదర్సాలు, అలీఘడ్ ముస్లిం యూనివర్శిటీని పేల్చివేసి, అందులోని విద్యార్థులను డిటెన్షన్ కేంద్రాలకు తరలించి వారి మెదడుకు చికిత్స చేయాలని సూచించారు. యతి నర్సింగానంద గత ఏడాది కూడా హరిద్వార్ లో విద్వేషపూరితంగా ప్రసంగించారు.(Haridwar hate speech case) ఆ కేసులో అరెస్టు అయిన యతి తర్వాత విడుదలయ్యారు.ఇటీవల మహాత్మాగాంధీకి వ్యతిరేకంగా కూడా యతి నర్సింగానంద వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దేశంలో కోటి మంది హిందువుల హత్యాకాండకు మహాత్మాగాంధీ(Mahatma Gandhi) బాధ్యుడని యతి ఆరోపించారు.


రాహుల్ గాంధీ(Rahul Gandhi) భారత్ జోడో యాత్రను జోక్ గా యతి నర్సింగానంద అభివర్ణించారు.రాహుల్ గాంధీతో జిహాదీలున్నారని అందుకే యూపీలో గెలవలేక కేరళలోని వయానడ్ కు వెళ్లారని ఆయన విమర్శించారు. రాహుల్ గాంధీ భారతదేశాన్ని బలోపేతం చేయాలంటే ముందుగా పాకిస్థాన్, బంగ్లాదేశ్ లకు వెళ్లి ఆ దేశాలను భారత్ తో కలపాలని యతి సూచించారు.


Updated Date - 2022-09-19T16:29:43+05:30 IST