పరిస్థితులు దిగజారుతుంటే చూస్తూ ఉండలేం: యశ్వంత్‌సిన్హా

ABN , First Publish Date - 2022-07-02T20:11:05+05:30 IST

పరిస్థితులు దిగజారుతుంటే చూస్తూ ఉండలేం: యశ్వంత్‌సిన్హా

పరిస్థితులు దిగజారుతుంటే చూస్తూ ఉండలేం: యశ్వంత్‌సిన్హా

హైదరాబాద్: టీఆర్‌ఎస్‌ మద్దతిస్తున్నందుకు విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్‌సిన్హా ధన్యవాదాలు తెలిపారు. సీఎం కేసీఆర్‌, కేటీఆర్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. దేశంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో కేసీఆర్‌ వివరించారని ఆయన చెప్పారు. తెలంగాణలో ప్రజాచైతన్యాన్ని ప్రత్యక్షంగా చూస్తున్నానని చెప్పారు. కేటీఆర్‌ ఢిల్లీకి వచ్చి తనకు మద్దతు ప్రకటించారని చెప్పారు. చాలారోజులుగా కేంద్ర విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నామని పేర్కొన్నారు. దేశంలో పరిస్థితులు దిగజారుతుంటే చూస్తూ ఉండలేమన్నారు. 



Updated Date - 2022-07-02T20:11:05+05:30 IST