Abn logo
Mar 10 2020 @ 12:43PM

కరోనాకూ మరణం ఉంది!

ఆంధ్రజ్యోతి(10-03-2020)

ఎలాంటి వ్యాధికారక సూక్ష్మజీవులైనా వాటికీ కాలపరిమితి ఉంటుంది. తరచూ రూపం మార్చుకునే తత్వం కారణంగా ఈ వైరస్‌ క్రమేపీ అంతరించిపోతుంది. ఇది కరోనాకూ వర్తిస్తుంది. అలాగే ఎలాంటి వైర్‌సల నుంచి అయినా మానవ శరీరం కాలక్రమేణా రక్షణ పెంచుకుంటూ ఉంటుంది. దీన్నే ‘హెర్డ్‌ ఇమ్యూనిటీ’ అంటారు. దీనికి సహజంగా ఆరు నెలల సమయం పట్టవచ్చు. వేడి వాతావరణం కలిగిన మన  తెలుగు రాష్ట్రాల్లో అంతకంటే తక్కువ సమయమే పట్టవచ్చు. ఫలితంగా ఈలోగా వైరస్‌ సోకినా పెద్దగా ప్రమాదం ఉండదు. ఇలా రెండు రకాలుగా ఈ వైరస్‌ నుంచి సురక్షితంగా బయటపడవచ్చు.


భయం అర్థం లేనిది!

స్వైన్‌ ఫ్లూ, సార్స్‌ (ఎస్‌.ఎఆర్‌.ఎస్‌), మార్స్‌ (ఎమ్‌.ఎ.ఆర్‌.ఎస్‌) వైరస్‌ల కంటే కరోనా పట్ల విపరీతమైన ప్రచారం, భయాందోళనలు పెరిగాయి. ఇందుకు కారణం ఈ వైరస్‌ వ్యాప్తి వేగంగా జరగడం, వైర్‌సను సంహరించే మందులు లేకపోవడమే! నిజానికి ఈ వైరస్‌ సోకిన 90 మందిలో జలుబు, దగ్గు లాంటి ఫ్లూ లక్షణాల రూపంలో బయల్పడి, వైరల్‌ లోడ్‌ను బట్టి క్రమేపీ తగ్గిపోతుంది. కాబట్టే ఇప్పటివరకూ ఈ వైరస్‌ సోకిన వారిలో మరణించిన వారి సంఖ్య 3 శాతానికే పరిమితమైంది. సోకిన వారందరినీ పరిగణనలోకి తీసుకుంటే వారిలో కేవలం 30 శాతం మందికే వ్యాధి తీవ్రమయ్యే అవకాశాలు ఉంటాయి. వారిలో హైరిస్క్‌ పేషెంట్లకు మాత్రమే ప్రాణాపాయం ఉండవచ్చు.


- డాక్టర్‌ బి.విజయ్‌ కుమార్‌,

సీనియర్‌ జనరల్‌ ఫిజీషియన్‌,

యశోదా హాస్పిటల్స్‌