మరో రెండు నెలల్లో సంపూర్ణంగా కోలుకుంటా: హీరోయిన్

తాను పూర్తిగా కోలుకునేందుకు మరో రెండు నెలలు పడుతుందని సినీ నటి యాషికా ఆనంద్‌ వెల్లడించింది. ఇటీవల ఒక షాపు ఓపెనింగ్‌ ఫంక్షన్‌లో పాల్గొన్నానని, కేవలం మైండ్‌ ఛేంజ్‌ కోసమే వచ్చానని పేర్కొంది. బిగ్‌బాస్‌ తమిళ రియాల్టీ షో ద్వారా సినిమా ఛాన్సులు దక్కించుకున్న హీరోయిన్‌  యాషికా ఆనంద్‌.. నాలుగు నెలల క్రితం మహాబలిపురం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడింది. ఈ ప్రమాదంలో ఆమె స్నేహితురాలు దుర్మరణం చెందగా యాషికాతో పాటు మరో ఇద్దరు ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. అయితే, ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన యాషికా.. నాలుగు నెలలుగా చికిత్స పొందుతోంది. ప్రస్తుతం ఫిజియోథెరపీ ట్రీట్‌మెంట్‌ జరుగుతోంది. అయినప్పటికీ.. ఆమె పూర్తిస్థాయిలో కోలుకోలేదు. 


దీనిపై ఆమె స్పందిస్తూ.. ఆరోగ్యం కొంతమేరకు ఫర్వాలేదు. కానీ, పూర్తిస్థాయిలో కోలుకునేందుకు మరికొంత సమయం పడుతుంది. ఫిజియోథెరపీతో పాటు వ్యాయామాలు చేస్తున్నాను. మరో రెండు నెలల్లో సంపూర్ణంగా కోలుకుంటానని భావిస్తున్నాను.. అని వెల్లడించింది. కాగా ఆమె నటించిన రెండు చిత్రాలలో ఒక చిత్రం విడుదలకు సిద్ధమవుతుండగా.. మరో చిత్రం యాషికా యాక్సిడెంట్‌తో బ్రేక్ పడింది. ఈ చిత్రంలో ఆమె పోలీస్‌ ఆఫీసర్‌ పాత్రలో నటించనుంది. పూర్తిగా కోలుకున్న తర్వాత ఈ చిత్రం షూటింగ్‌లో పాల్గొంటానని యాషికా ఆనంద్‌ తెలియజేసింది.

Advertisement