Chitrajyothy Logo
Advertisement
Published: Wed, 13 Apr 2022 16:46:37 IST

చరిత్ర సృష్టించబోతున్న K.G.F: Chapter 2.. మొదటి రోజు వసూళ్లతోనే రికార్డులు..!

twitter-iconwatsapp-iconfb-icon

రాకింగ్ స్టార్ యశ్ హీరోగా నటించిన సినిమా ‘కేజీఎఫ్: చాప్టర్-2’. బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించిన ‘కేజీఎఫ్’కు సీక్వెల్‌గా ఈ చిత్రం తెరకెక్కింది. యశ్ ఈ మూవీలో రాకీ భాయ్ అనే పాత్రలో అభిమానులను అలరించాడు. ‘కేజీఎఫ్-1’ విజయం సాధించడంతో ‘చాప్టర్-2’ పై మంచి అంచనాలున్నాయి. గత వారంలో ఈ సినిమాకు సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్‌ను ఓపెన్ చేశారు. ఆ టిక్కెట్ల అమ్మకాలు అందరిని ఆశ్చర్యపరిచాయి. అభిమానులు తారస్థాయిలో టిక్కెట్లను బుక్ చేసుకున్నారు. 


‘కేజీఎఫ్: చాప్టర్-2’ బాలీవుడ్‌లో చరిత్ర సృష్టించబోతున్నట్టు తెలుస్తోంది. మొదటి రోజే దాదాపుగా రూ. 40కోట్ల వసూళ్లను రాబట్టనున్నట్టు ట్రేడ్ విశ్లేషకులు తెలుపుతున్నారు. కరోనా అనంతరం విడుదలైన చిత్రాల్లో అత్యధిక వసూళ్లను రాబట్టిన మూవీగా నిలవబోతున్నట్టు సమాచారం. నాలుగేళ్ల క్రితం ‘కేజీఎఫ్-1’ విడుదలైనప్పుడు షారూఖ్ ఖాన్ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘జీరో’ తో  క్లాష్ అయింది. దీంతో మొదటి రోజు తక్కువగా వసూళ్లను సాధించింది. షాహిద్ కపూర్ హీరోగా నటించిన ‘జెర్సీ’ సినిమా కూడా వాయిదా పడటం ‘కేజీఎఫ్’కు కలిసోచ్చే అంశం. ‘కేజీఎఫ్’ను ఆరు వేలకు పైగా స్ర్కీన్స్‌లో విడుదల చేస్తున్నారు. ‘వార్’, ‘ది అవెంజర్స్ ఎండ్ గేమ్’కు దగ్గరగా ‘కేజీఎఫ్’ కలెక్షన్లు ఉండొచ్చని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ రెండు చిత్రాలు మొదటి రోజు రూ.50కోట్లకు పైగా వసూళ్లను సాధించాయి. ‘కేజీఎఫ్: చాప్టర్-2’ కూడా అదే రేంజ్‌లో వసూళ్లను రాబడితే అది చెప్పుకోదగ్గ విశేషమే.  

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

BollywoodLatest Telugu Cinema Newsమరిన్ని...

Advertisement
Advertisement