ntr health university name change: నాకు ఎన్టీఆర్ అంటే అమితమైన భక్తి: యార్లగడ్డ లక్ష్మీప్రసాద్
ABN , First Publish Date - 2022-09-26T02:13:30+05:30 IST
మంచో చెడో ఎన్టీ రామారావు విషయంలో ఓ దురదృష్టకరమైన ఘటన జరిగింది. నాకు ఎన్టీఆర్ (NTR) అంటే అమితమైన భక్తి
తిరుమల: ‘మంచో చెడో ఎన్టీ రామారావు విషయంలో ఓ దురదృష్టకరమైన ఘటన జరిగింది. నాకు ఎన్టీఆర్ (NTR) అంటే అమితమైన భక్తి. తెలుగు వ్యక్తిత్వానికి, తెలుగుజాతికి నిలువెత్తు నిదర్శనమైన ఎన్టీఆర్ అంటే నాకు గౌరవం. ఇప్పటికే హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుపై మాట్లాడాను. ఇకపై మాట్లాడాలనుకోవడం లేదు’ అని రాష్ట్ర అధికార భాష సంఘ చైర్మన్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ (Yarlagadda Lakshmi Prasad) ప్రకటించారు. ఆదివారం ఉదయం వీఐపీ (VIP) బ్రేక్ సమయంలో తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకున్న ఆయన, ఆలయం ముందు మీడియాతో మాట్లాడారు. ఇకపై రాజకీయాలు మాట్లాడనని శ్రీవారి సన్నిధిలో సంకల్పం తీసుకున్నట్టు తెలిపారు. బహిరంగంగా రాజకీయ నాయకుల పేర్లు ప్రస్తావించనన్నారు. రాజకీయ నాయకులు చెడ్డవారని, రాజకీయాలు చెడ్డవని తాను చెప్పడం లేదన్నారు. తాను రాజకీయ నాయకుడు కాకపోయినా అనేక రాజకీయాలు చేశానన్నారు. ఇకపై వాటికి స్వస్తి పలుకుతానని చెప్పారు. రాష్ట్రంలో పాలనా భాషగా తెలుగును అమలు చేయించడమే తన జీవితానికి ఉన్న ఏకైక లక్ష్యమని స్పష్టం చేశారు. తెలుగు భాష పరిరక్షణకు, వికాసానికి కృషి చేస్తానని యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ తెలిపారు.