Abn logo
Sep 22 2021 @ 11:01AM

స్టీల్ ప్లాంట్ అమ్మకంలో జగన్ వాటా ఎంత?: యరపతినేని

గుంటూరు: ఒక్క ఛాన్స్ అంటూ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి.. రెండున్నరేళ్లలో  రెండున్నర లక్షల కోట్లు దోచుకున్నారని మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు విమర్శించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ గంగవరం పోర్టులో ప్రభుత్వ వాటాను ఆదానికి అమ్మేశారని, రూ. 30 లక్షల కోట్లు విలువైన విశాఖ స్టీల్ ప్లాంట్  అమ్మకంలో జగన్ వాటా ఎంత? అని ప్రశ్నించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కలసి దొంగాట అడుతున్నాయన్నారు. ఉచితంగా ఇళ్లు నిర్మిస్తామని పేదలను వంచించారని, ప్రజలపై రూ. 12వేల కోట్ల విద్యుత్ చార్జీల భారం వేశారని ఆరోపించారు. మరో 6 వేల కోట్లు పెంపునకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారన్నారు. సీఎం జగన్‌ అన్నివర్గాల వారిని వంచించారని యరపతినేని శ్రీనివాసరావు విమర్శించారు.

ఇవి కూడా చదవండిImage Caption