యండమూరి కథ... వర్మ దర్శకత్వం

యండమూరి రచనలలో ‘తులసి దళం’కి ప్రత్యేకమైన స్థానం ఉంది. తెలుగు పాఠకులకు హారర్‌ సినిమా చూస్తున్న అనుభూతి కలిగించిన నవల అది. ఇప్పుడు ఈ నవలకు సీక్వెల్‌గా ‘తులసి తీర్థం’ వచ్చింది. ఇది సినిమాగా రాబోతోంది. రాంగోపాల్‌ వర్మ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తారు. భీమవరం టాకీస్‌ పతాకంపై తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మించనున్నారు. ఇటీవల హైదరాబాద్‌లో పోస్టర్‌ని ఆవిష్కరించారు. ‘‘అరుదైన కలయికలో రూపొందుతున్న చిత్రమిది. గ్రాఫిక్స్‌కి అధిక ప్రాధాన్యం ఉంది. త్వరలోనే షూటింగ్‌ మొదలెడతామ’’ని నిర్మాత తెలిపారు.


Advertisement