AP News.. జగన్ రెడ్డి ఏపీ ముస్సోలినిగా మారారు..: యనమల

ABN , First Publish Date - 2022-08-26T17:17:35+05:30 IST

సీఎం జగన్ ఏపీ ముస్సోలినిగా మారారని టీడీపీ నేత యనమల రామకృష్ణుడు అన్నారు.

AP News.. జగన్ రెడ్డి ఏపీ ముస్సోలినిగా మారారు..: యనమల

అమరావతి (Amaravathi): సీఎం జగన్ రెడ్డి (CM Jagan reddy) ఏపీ (AP) ముస్సోలిని (Mussolini)గా మారారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు (Yanamala Ramakrishnudu) అన్నారు. శుక్రవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ముస్సోలినికి ఉన్న హ్రస్వ దృష్టి, అహంకారం, అర్థం చేసుకోలేని లక్షణం జగన్ రెడ్డిలో అచ్చొచ్చినట్టు కన్పిస్తున్నాయన్నారు. కుప్పంలో చంద్రబాబు నాయుడు (Chandrababu naidu) పర్యటనపై వైసీపీ (YCP) గూండాల దాడి పిరికిపంద చర్య అన్నారు. తరచూ ప్రతిపక్ష నేత పర్యటనను అడ్డుకోవటం, దాడులకు పాల్పడటం ఏపీలో తప్ప దేశంలో మరెక్కడైనా ఉందా? అని ప్రశ్నించారు. నాడు జగన్ రెడ్డి తాత రాజారెడ్డి ప్యాక్షన్‌ని పెంచి పోషిస్తే.. నేడు జగన్ రెడ్డి మళ్లీ ఫ్యాక్షనిజానికి, రౌడీయిజానికి రెక్కలు తొడిగారన్నారు. ప్రశ్నించిన వారిపై దాడులు చేయిస్తూ, ప్రతిపక్షాలపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తూ నియంతృత్వంలో జగన్ రెడ్డి ముస్సోలినిని మరిపిస్తున్నారన్నారు. 


ప్రజల్ని గుప్పిట్లో పెట్టుకుందామన్న నియంతలు, రౌడీలు కాలగర్బంలో కలిసిపోయారని చరిత్ర చెబుతోందని యనమల అన్నారు. ఓటు అనే ఆయుధంతో జగన్ రెడ్డి అరాచక, ఫ్యాక్షన్ పాలనను అంతమెందించేందుకు ప్రజలు ఆకలితో ఉన్న సింహాల్లా ఎదురు చూస్తున్నారన్నారు. ఇటలీలో ముస్సోలినికి పట్టిన గతే ఏపీలో జగన్ రెడ్డికీ పడుతుందన్నారు. పోలీసుల ఏకపక్ష వైఖరి సరికాదని, అధికారం ఏ రాజకీయ పార్టీకి శాశ్వతం కాదన్నారు. వైసీపీకి కొమ్ముకాస్తున్న పోలీసులకు భవిష్యత్‌లో ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. ప్రభుత్వ వైఫల్యాలు, తప్పిదాలు బయటపడ్డ ప్రతిసారీ దాన్ని కప్పిపుచ్చుకునేందుకు రాష్ట్రంలో ఎక్కడో చోట అల్లర్లు, దాడులకు పాల్పడుతున్నారని విమర్శించారు. జగన్ రెడ్డి పాలనలో ఏపీలో బ్రతకటం కంటే ఉక్రెయిన్‌లో బతకటం మేలన్న భావనలో ప్రజలున్నారన్నారు. 151 సీట్లు గెలిచామన్న గర్వంతో నియంతృత్వంగా వ్యవహరిస్తున్న జగన్ రెడ్డికి వచ్చే ఎన్నికల్లో సింగిల్ డిజిట్ కూడా దక్కదు యనమల జోస్యం చెప్పారు.

Updated Date - 2022-08-26T17:17:35+05:30 IST