కేంద్రంతో జగన్‌రెడ్డి మోకాళ్ల బేరం

ABN , First Publish Date - 2021-06-20T09:12:58+05:30 IST

‘‘ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి కేంద్రంతో మోకాళ్ల బేరానికి వచ్చారు. మెడ వంచి మోకాళ్ల నమస్కారాలు చేస్తున్నారు. హోదా తేవడం తనకు చేతకాదని జగన్‌రెడ్డి ప్రకటనే స్పష్టం చేసింది

కేంద్రంతో జగన్‌రెడ్డి మోకాళ్ల బేరం

హోదా తేలేక చేతులెత్తేసిన సీఎం

యువతకు తీరని ద్రోహం చేశాడు: యనమల


అమరావతి, జూన్‌ 19(ఆంధ్రజ్యోతి): ‘‘ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి కేంద్రంతో మోకాళ్ల బేరానికి వచ్చారు. మెడ వంచి మోకాళ్ల నమస్కారాలు చేస్తున్నారు. హోదా తేవడం తనకు చేతకాదని జగన్‌రెడ్డి ప్రకటనే స్పష్టం చేసింది. తనపై ఈడీ, సీఐడీ కేసుల కారణంగానే కేంద్రానికి లొంగిపోయాడు. ప్రత్యేక హోదా తేలేనని చేతులెత్తేశాడు. యువతకు తీరని ద్రోహం చేశాడు’’ అని తెలుగుదేశం పార్టీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు విమర్శించారు. ఈ మేరకు ఆయన శనివారం ఒక ప్రకటన చేశారు. 25 మంది ఎంపీలనిస్తే కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తానన్న జగన్‌... మోకాళ్ల బేరానికి వచ్చేశాడన్నారు. దిష్టిబొమ్మల్లాంటి ఈ ఎంపీల వల్ల రాష్ట్రానికి ఎలాంటి ఉపయోగం లేదన్నారు. చేతకాని వైసీపీ ఎంపీలంతా రాజీనామాలు చేసి ఇళ్లకు పోవాలని డిమాండ్‌ చేశారు. 2020-21లో పారిశ్రామిక అభివృద్ధి ఇప్పటికే -3.26 శాతానికి పడిపోయిందన్నారు. చదువుకున్న యువతలో నిరుద్యోగిత రేటు 13.5 శాతానికి చేరిందన్నారు. రాయితీలు అందక, ప్రోత్సాహకాలు లేక పారిశ్రామిక రంగం కుదేలైపోతోందన్నారు. 

Updated Date - 2021-06-20T09:12:58+05:30 IST