రేపు యానాంలో లిబరేషన్‌ డే వేడుకలు

ABN , First Publish Date - 2020-10-31T06:20:24+05:30 IST

యానాంలో నవంబరు ఒకటో తేదీన లిబరేషన్‌ డే వేడుకలు నిర్వహించడానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

రేపు యానాంలో లిబరేషన్‌ డే వేడుకలు



యానాం, అక్టోబరు 30:
యానాంలో నవంబరు ఒకటో తేదీన లిబరేషన్‌ డే వేడుకలు నిర్వహించడానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. పరిపాలనాధికారి శివరాజ్‌మీనా నేతృత్వంలో స్థానిక జీఎంసీ బాలయోగి క్రీడా మైదానంలో నిర్వహించనున్న కార్యక్రమానికి  ఆరోగ్యశాఖ మంత్రి మల్లాడి కృష్ణారావు ముఖ్యఅతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారు.  ఈకార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను ఎస్పీ భక్తవత్సలన్‌, అధికారులు పర్యవేక్షించారు. ఈకార్యక్రమానికి సంబంధించిన పోలీసులు కవాతా ఫైనల్‌ రిహార్సల్స్‌ నిర్వహించారు. ఎస్పీ భక్తవత్సలన్‌, సీఐ గూటం శివగణేష్‌, ఎస్‌ఐలు సుబ్బరాజు, కనకారావు పోలీసలు కవాతులో పాల్గొన్నారు.


Updated Date - 2020-10-31T06:20:24+05:30 IST