Abn logo
Feb 24 2021 @ 06:52AM

యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం... ఏడుగురు మృతి!

మధుర: ఉత్తరప్రదేశ్‌లోని మధురలో మంగళవారం అర్థరాత్రి దాటాక ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. నౌఝీల్ ప్రాతంలోని యమున ఎక్స్‌ప్రెస్‌వేపై డీజిల్ ట్యాంకర్‌ను ఇన్నోవా కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో ఇన్నోవా కారులో ప్రయాణిస్తున్న ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. 

మృతదేహాలను పోస్టుమార్టంనకు తరలించారు. ఆగ్రా నుంచి వస్తున్న డీజిల్ ట్యాంకర్ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొని రోడ్డుకు అవతలి వైపునకు వెళ్లిపోయింది. ఈ సమయంలో నోయిడా నుంచి వస్తున్న ఇన్నోవా కారు ఈ ట్యాంకర్‌ను బలంగా ఢీకొంది. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటన గురించి తెలుసుకున్న ఎస్‌ఎస్పీ తన బృందంతో పాటు ప్రమాదస్థలికి చేరుకున్నారు. మృతులంతా హరియాణాలోని జీంద్ కు చెందినవారిగా పోలీసులు గుర్తించారు. ఎక్స్‌ప్రెస్ వేను మూసివేసి సహాయక చర్యలు చేపడుతున్నారు. 

Advertisement
Advertisement
Advertisement