హోరాహోరీగా ఎడ్ల పందాలు

ABN , First Publish Date - 2021-03-07T05:48:21+05:30 IST

మహాశివరాత్రిని పురస్కరించుకొని సత్రశాలలోని భక్త మల్లారెడ్డి అన్నదానసత్రంలో రాష్ట్రస్థాయి ఎడ్లపందాల్లో భాగంగా రెండో రోజైన శనివారం నాలుగు పళ్ల విభాగం లో పోటీలు నిర్వహించారు.

హోరాహోరీగా ఎడ్ల పందాలు
ప్రథమ బహుమతిని స్వీకరిస్తున్న పావులూరి వినోద్‌కుమార్‌

రెంటచింతల, మార్చి 6: మహాశివరాత్రిని పురస్కరించుకొని సత్రశాలలోని భక్త మల్లారెడ్డి అన్నదానసత్రంలో రాష్ట్రస్థాయి ఎడ్లపందాల్లో భాగంగా రెండో రోజైన శనివారం నాలుగు పళ్ల విభాగం లో పోటీలు నిర్వహించారు. ప్రథమ బహుమతిని యడ్లపాడు మండలం తిమ్మాపురానికి చెందిన పావులూరి వినోద్‌కుమార్‌ ఎడ్లజత 3,805 దూరం లాగి ప్రఽథమస్థానం సాధించింది.  దాచేపల్లి మండలం కేశానుపల్లికి చెందిన కోట కోటేశ్వరరావు ఎడ్లజత 3608.10 అడుగుల దూరంతో ద్వితీయ, నాదెండ్లకు చెందిన దేవభక్తుని రవీంద్రనాథ్‌ ఎడ్లజత 3563.2 అడుగుల దూరంతో తృతీయ, చుండూరు మండలం వేటపాలెంకు చెందిన అత్తోట శిరీష, శివకృష్ణ చౌదరి ఎడ్లజత నాలుగు,  ప్రకాశం జిల్లా పర్చూరి మండలం వీరన్నపాలెం గ్రామం మువ్వా నందప్రియ ఎడ్లజత ఐదో స్థానం సాధించాయి. 

Updated Date - 2021-03-07T05:48:21+05:30 IST