Advertisement
Advertisement
Abn logo
Advertisement

దేశంలోని ఆలయాలకు యాదాద్రి ఆదర్శంగా ఉండాలి: కేసీఆర్‌

యాదాద్రి: దేశంలోని ఆలయాలకు యాదాద్రి ఆదర్శంగా ఉండాలని సీఎం కేసీఆర్‌ ఆకాంక్షించారు. గురువారం యాదాద్రి ఆలయ అభివృద్ధి పనులను కేసీఆర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ ఆలయ నిర్మాణ పనులు 90 శాతానికి పైగా పూర్తైయ్యాని తెలిపారు. భక్తులు వైకుంఠ పుణ్యక్షేత్రంలోకి వచ్చిన అనుభూతి కలిగేలా.. యాదాద్రి నిర్మాణాలకు తుది మెరుగులు దిద్దాలని సూచించారు.  ఆలయంలో లిఫ్టుల పనులు త్వరగా పూర్తి చేయాలని కేసీఆర్‌ ఆదేశించారు. యాదాద్రి దివ్యక్షేత్రంలో రెండు గంటల పాటు ఆలయ పునర్నిర్మాణ పనులను అణువణువునా యాదాద్రి పునర్నిర్మాణ ప్రధానాలయ పరిసరాలను సీఎం పరిశీలించారు. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ప్రత్యేకంగా తయారు చేయించిన క్యూ లైన్లులను పరిశీలించారు. బంగారు వర్ణంలో తయారు చేయబడిన క్యూలైన్ గ్రిల్స్‌పై శంకుచక్రాలు, గోవిందా నామాలు, ముఖ మండపం, ఐరావతం బొమ్మలు, అల్లికలను ప్రత్యేకంగా పరిశీలించిన సీఎం కేసీఆర్ క్యూలైన్లపై పలు సూచనలు చేశారు. 

Advertisement
Advertisement