యాదాద్రి-భువనగిరి: యాదగిరి గుట్ట శ్రీలక్ష్మీ నరసింహ స్వామి ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది. వరుస సెలవులు రావడంతో ఆలయానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు. దీంతో ఆలయంలోని పరిసర ప్రాంతాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. క్యూ కాంప్లెక్స్‌లు నిండటంతో.. స్వామివారి దర్శనానికి రెండు గంటలకు పైగా సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనానికి దాదాపు అర గంట సమయం పడుతోంది. దీంతో భక్తులు ఇబ్బంది పడుతున్నారు. మరోవైపు ఆలయ అభివృద్ధి పనులు జరుగుతుండటంతో పోలీసులు. గుట్టపైకి వాహనాలను అనుమతించడం లేదు.
ఇవి కూడా చదవండి