Advertisement
Advertisement
Abn logo
Advertisement

కరెంటు వైర్లు దొంగతనం చేస్తున్న ఐదుగురి అరెస్ట్

యాదాద్రి-భువనగిరి: రియల్ ఎస్టేట్ వెంచర్లలో కరెంటు వైర్లు దొంగతనం చేస్తున్న ఐదుగురుని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు జనగామ జిల్లాకు చెందినవారుగా గుర్తించారు. నిందితుల నుంచి రూ. 8,25,000 నగదు, టాటా ఎస్, అశోక్ లే ల్యాండ్ వాహనాలు, రెండు బైక్స్, 5 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై యాదగిరి గుట్ట, భువనగిరి రూరల్, భువనగిరి పట్టణం, బొమ్మల రామారం, బీబీ నగర్ మండలాల్లో 7 కేసులు నమోదయినట్లు డీసీపీ నారాయణ రెడ్డి వెల్లడించారు.

Advertisement
Advertisement