యాదాద్రి ఆలయ పునఃప్రారంభానికి ముహూర్తం ఖరారు

ABN , First Publish Date - 2021-10-20T01:12:25+05:30 IST

యాదాద్రి ఆలయ పునఃప్రారంభం ముహూర్తం ఖరారు అయింది. వచ్చే ఏడాది మార్చి 28న మహాకుంభ సంప్రోక్షణ చేయనున్నట్లు...

యాదాద్రి ఆలయ పునఃప్రారంభానికి ముహూర్తం ఖరారు

హైదరాబాద్: యాదాద్రి ఆలయ పునఃప్రారంభం ముహూర్తం ఖరారు అయింది.  వచ్చే ఏడాది మార్చి 28న మహాకుంభ సంప్రోక్షణ చేయనున్నట్లు సీఎం కేసీఆర్ తెలిపారు. 2022 మార్చి 20 నుంచి మహా సుదర్శన యాగం  చేపట్టనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో అన్ని రంగాల్లో తెలంగాణ అణచివేయబడిందని చెప్పారు. గొప్ప ఆధ్యాత్మిక సంపద ఉన్న రాష్ట్రం తెలంగాణ అని కేసీఆర్ వ్యాఖ్యానించారు. గతంలో పుష్కరాలు కూడా నిర్వహించేవారు కాదన్నారు. ఉద్యమ సమయంలో ప్రశ్నిస్తే పుష్కరఘాట్లు నిర్మించారని గుర్తు చేశారు. జోగులాంబ దేవాలయం గొప్ప శక్తిపీఠమని తెలిపారు. కృష్ణా పుష్కరాలను జోగులాంబ గద్వాలలో ప్రారంభించామన్నారు. యాదాద్రి ఎప్పుడు ప్రారంభిస్తారని అందరూ అడుగుతున్నారని కేసీఆర్ తెలిపారు. 



Updated Date - 2021-10-20T01:12:25+05:30 IST