TS News: యాదాద్రిలో చిచ్చు రేపిన ప్రేమ

ABN , First Publish Date - 2022-10-01T15:04:48+05:30 IST

జిల్లాలోని తుర్కపల్లి మండలం గంధమల్ల గ్రామంలో ప్రేమ చిచ్చు రేపింది.

TS News: యాదాద్రిలో చిచ్చు రేపిన ప్రేమ

యాదాద్రి: జిల్లాలోని తుర్కపల్లి మండలం గంధమల్ల గ్రామంలో ప్రేమ చిచ్చు రేపింది. ప్రేమ వివాహం చేసుకున్నాడని ఇల్లును తగలబెట్టిన వైనం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. వేముల భాను అనే యువకుడు అదే గ్రామానికి చెందిన యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి ఫోటోలను భాను వాట్సాప్ గ్రూప్‌లో షేర్ చేశాడు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన యువతి కుటుంబసభ్యులు... భాను ఇంటిని తగలబెట్టారు. యువకుడి ఫిర్యాదు మేరకు ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

Updated Date - 2022-10-01T15:04:48+05:30 IST