యాదాద్రి పునర్నిర్మాణం.. చరిత్రాత్మక నిర్ణయం

ABN , First Publish Date - 2022-01-22T05:38:51+05:30 IST

యాదాద్రి పునర్నిర్మాణం చరిత్రాత్మక నిర్ణయమని దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు.

యాదాద్రి పునర్నిర్మాణం.. చరిత్రాత్మక నిర్ణయం
యాదాద్రి కొండపై విస్తరణ పనులను పరిశీలిస్తున్న మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి

మార్చి 21న మహాసుదర్శన యాగం.. 28న మహాకుంభ సంప్రోక్షణ 

మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి

యాదాద్రి, జనవరి 21(ఆంధ్రజ్యోతి): యాదాద్రి పునర్నిర్మాణం చరిత్రాత్మక నిర్ణయమని దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. ప్రభు త్వ విప్‌, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్‌రెడ్డితో కలిసి శుక్రవారం ఆయన యాదాద్రిక్షేత్రాన్ని సందర్శించారు.  క్షేత్ర సందర్శనకు విచ్చేసిన ఆయనకు అర్చకులు ఆలయ మర్యాదలతో పూర్ణకుంభ స్వాగతం పలికారు.బాలాలయ కవచమూర్తులను ఆయన దర్శించుకుని సువర్ణ పుష్పార్చన పూజల్లో పాల్గొన్నారు. మం డపంలో అర్చకులు ఆయనకు ఆశీర్వచనం నిర్వహించ గా, దేవస్థాన ఈవో గీతారెడ్డి స్వామివారి ప్రసాదాలను కానుకగా అందజేశారు. ఆలయ పునర్నిర్మాణ పనుల ను పరిశీలించిన అనంతరం ఆయన కొండపైన ఘాట్‌రోడ్‌లోని హరితాకాటేజ్‌లో వివిధ శాఖల అధికారుల తో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి మాట్లాడుతూ యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణానికి సీఎం కేసీఆర్‌ తీసుకున్న నిర్ణయం చరిత్రాత్మకమైందని అభివర్ణించారు. తెలంగాణ తిరుపతిగా యాదాద్రిని ఆయన తీర్చిదిద్దుతున్నారని, ఆలయ పునర్నిర్మాణంతో యాదాద్రిక్షేత్ర చరిత్ర విశ్వవ్యాప్తం కానుందన్నారు. ఆధ్యాత్మిక నగరిగా రూపొందుతున్న యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్ర ఉద్ఘాటనకు సర్వం సిద్ధం చేస్తున్న ట్లు తెలిపారు. మార్చి 21న మహాసుదర్శన యాగం ఆరంభమవుతుందని, మార్చి 28న మహాకుంభ సంప్రోక్షణ, గర్భాలయంలో స్వయంభువుల దర్శనాలు ప్రారంభంకానున్నాయన్నారు. 


95శాతం పూర్తయిన పనులు 

యాగశాలలను సందర్శించే భక్తుల కోసం 8రోజుల పాటు లక్ష మంది భక్తులకు భోజన సౌకర్యం కూడా కల్పించనున్నట్టు వెల్లడించారు. ఆలయ అభివృద్ధి పను లు దాదాపు 95 శాతం పూర్తయ్యాయని, మిగిలిన 5 శాతం పనులు త్వరలోనే పూర్తికానున్నట్లు తెలిపారు. కార్యక్రమాల్లో వైటీడీఏ వైస్‌ చైర్మన్‌ కిషన్‌రావు, దేవాదాయ శాఖ కమిషనర్‌ అనిల్‌కుమార్‌, ఆర్కిటెక్‌ ఆనందసాయి, ఈఎన్‌సీ రవీందర్‌రావు, ఆర్‌అండ్‌బీ, రెవె న్యూ, దేవస్థాన, వైటీడీఏ అధికారులు తదితరులున్నా రు. ఇదిలా ఉంటే యాదాద్రి ఆలయ విస్తరణ పనుల పరిశీలనకు వచ్చిన మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డిని కొండపై న వర్తక సంఘం సభ్యులు అడ్డుకున్నారు. కొండపైన బాలాలయంలో పూజలు నిర్వహించిన ఆయన ఆల య విస్తరణ పనుల పరిశీలనకు కాన్వాయ్‌లో వెళుతుండగా,కొండపైన లిఫ్టుసమీపంలో కాన్వాయ్‌ని అడ్డుకుని తమకు న్యాయం చేయాలని డిమాండ్‌చేశారు. 


 యాదాద్రి ఆలయ విస్తరణ నిరంతర ప్రక్రియ

యాదాద్రి ఆలయ విస్తరణ నిరంతర ప్రక్రియ అని, అనుకున్న సమయానికి ఆలయ ఉద్ఘాటన నిర్వహిస్తామని మంత్రి తెలిపారు. ఆలయ ఉద్ఘాటన సమయాని కి అన్ని వసతులు కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు తె లిపారు. ఆలయ ఉద్ఘాటన అనంతరం మిగిలిన పను లు కొనసాగుతాయని,ఇది నిరంతంర ప్రక్రియని అన్నా రు. బస్వాపూర్‌ రిజర్వాయర్‌ నిర్మాణం త్వరలోనే పూర్తి కానుందని, యాదాద్రికి బస్వాపూర్‌ రిజర్వాయర్‌ నుం చి గోదావరి జలాలు త్వరలోనే రానునన్నాయన్నారు. 

Updated Date - 2022-01-22T05:38:51+05:30 IST