రాష్ట్రానికే రోల్‌ మోడల్‌ యాదాద్రి నేచురల్‌ ఫారెస్ట్‌

ABN , First Publish Date - 2022-01-23T06:14:18+05:30 IST

చౌటుప్పల్‌ మునిసిపాలిటీలోని యదాద్రి మోడల్‌ నేచురల్‌ ఫారెస్టు (మియావాకి) రాష్ట్రానికే రోల్‌ మోడల్‌గా నిలిచిందని నాగార్జునసాగర్‌ ఫారెస్ట్‌ డివిజనల్‌ అధికారి కె.సర్వేశ్వర్‌రావు అన్నారు.

రాష్ట్రానికే రోల్‌ మోడల్‌ యాదాద్రి నేచురల్‌ ఫారెస్ట్‌
తంగేడు వనాన్ని సందర్శించిన ఫారెస్టు అధికారి సర్వేశ్వర్‌రావు


చౌటుప్పల్‌ టౌన, జనవరి 22: చౌటుప్పల్‌ మునిసిపాలిటీలోని  యదాద్రి మోడల్‌ నేచురల్‌ ఫారెస్టు (మియావాకి) రాష్ట్రానికే రోల్‌ మోడల్‌గా నిలిచిందని నాగార్జునసాగర్‌ ఫారెస్ట్‌ డివిజనల్‌ అధికారి కె.సర్వేశ్వర్‌రావు అన్నారు. మునిసిపాలిటీలోని తంగేడు వనాన్ని శనివారం సాయంత్రం సర్వేశ్వర్‌రావు అకస్మికంగా సందర్శించారు. ఒక ఎకరం భూమిలో పెరిగిన 35 రకాలైన నాలుగు వేల చెట్లను పరిశీలించారు. 2018 సెప్టెంబరు 9న తాను రేంజర్‌గా ఉన్న సమయంలో నాటిన ఈ మొక్కలు వృద్ధి చెంది చెట్లుగా మారడం పట్ల సర్వేశ్వర్‌ ఆనందం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌- విజయవాడ జాతీయ రహదారిపై ఉన్న ఈ తంగేడు వనం భవిష్యతలో మరింతగా అభివృద్ధి చెందనుందని, సందర్శకులకు వీనుల విందు చేయనుందని ఆయన అభిప్రాయపడ్డారు.

Updated Date - 2022-01-23T06:14:18+05:30 IST