యాదాద్రి: ఆరేళ్ల తర్వాత యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దర్శనమిచ్చారు. గర్భాలయంలోని మూలవిరాట్ నిజరూపంలో దర్శనమిచ్చారు. ప్రధాన ద్వారం నుంచి సీఎం కేసీఆర్, మంత్రులు ప్రధానాలయ ప్రవేశం చేశారు. స్వయంభువుగా వెలసిన స్వామివారికి ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు తొలిపూజ చేశారు. తొలుత ఉపాలయాల్లోని ప్రతిష్ట మూర్తులకు మహా ప్రాణాన్యాసం శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం గర్బాలయంలో మొదటి పూజ చేశారు. ఈ సందర్బంగా వేదపండితులు కేసీఆర్ దంపతులకు మహావేద ఆశీర్వచనం అందజేశారు. మొదటి తీర్థ ప్రసాద గోష్ఠిని సమర్పించారు.
ఇవి కూడా చదవండి