Yadadri: రైతుబంధు వారోత్సవాల్లో పాల్గొన్న మంత్రి నిరంజన్

ABN , First Publish Date - 2022-01-07T16:47:55+05:30 IST

జిల్లాలోని ఆలేరులో నిర్వహించిన రైతు బంధు వారోత్సవాలల్లో పాల్గొన్న వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి పాల్గొన్నారు.

Yadadri: రైతుబంధు వారోత్సవాల్లో పాల్గొన్న మంత్రి నిరంజన్

యాదాద్రి-భువనగిరి: జిల్లాలోని ఆలేరులో నిర్వహించిన రైతు బంధు వారోత్సవాలల్లో వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పల్లెపల్లెనా రైతుబంధు విజయోత్సవాలు ఘనంగా సాగుతున్నాయన్నారు. వ్యవసాయం నాడు - నేడు అని చిన్నారులు వ్యాసరచనలు, చిత్రలేఖన పోటీలతో వ్యవసాయరంగ గొప్పదనాన్ని చాటి చెబుతున్నారని తెలిపారు. రాష్ట్రంలో పత్తి రైతుల మోములో చిరునవ్వులు పూస్తున్నాయని,  మార్కెట్‌లో పత్తి క్వింటా రూ.9 వేల నుండి రూ.10 వేలు ధర పలుకుతుందోని చెప్పారు. తెలంగాణ పత్తికి అంతర్జాతీయ డిమాండ్ ఉందని, రైతులు పత్తి సాగుకు మొగ్గుచూపాలని మంత్రి తెలిపారు. ఎనిమిది విడతలలో రూ.50 వేల కోట్లు రైతుల ఖాతాలలో వేయడం అపూర్వమైన విజయమన్నారు. వ్యవసాయరంగంతో పాటు అన్ని రంగాలలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టి సీఎం కేసీఆర్ ఉపాధి అవకాశాలు పెంచుతున్నారని మంత్రి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి పాల్గొన్నారు. 

Updated Date - 2022-01-07T16:47:55+05:30 IST