యాదాద్రి: జిల్లాలోని అడ్డగూడూరు పోలీస్ స్టేషన్‌లో లాకప్‌డెత్ జరిగింది. లాకప్‌డెత్‌లో చనిపోయిన వ్యక్తిని మరియమ్మ(45) అనే మహిళగా గుర్తించారు. ఇటీవల అడ్డగూడూరు మండలంలోని గోవిందాపురంలో ఫాదర్ బాలశౌరి ఇంట్లో 2 లక్షలు చోరీ జరిగాయి. పనిమనిషి మరియమ్మపై అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ చేస్తున్న క్రమంలో మరియమ్మ మృతి చెందినట్టుగా సమాచారం. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం భువనగిరి ఆసుపత్రి మార్చురీకి తరలించారు.