భక్తజన సంద్రం.. యాదాద్రి క్షేత్రం

ABN , First Publish Date - 2022-02-21T01:51:52+05:30 IST

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి సన్నిధి ఆదివారం భక్తజన సంద్రమైంది. వారాంతపు సెలవు రోజు కావడంతో ఇష్టదైవాలను దర్శించుకుని

భక్తజన సంద్రం.. యాదాద్రి క్షేత్రం

యాదాద్రి: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి సన్నిధి ఆదివారం భక్తజన సంద్రమైంది. వారాంతపు సెలవు రోజు కావడంతో ఇష్టదైవాలను దర్శించుకుని, మొక్కు చెల్లించుకునేందుకు పెద్దసంఖ్యలో భక్తులు తరలివచ్చారు. దీంతో ఆలయ పరిసరాలు, సేవామండపాలు, తిరువీధుల్లో యాత్రాజనుల రద్దీ ఏర్పడింది. స్వామివారి దర్శనానికి క్యూలైన్లలో గంటలకొద్దీ నిరీక్షించారు. దేవదేవుడి దర్శదర్శనాలకు మూడుగంటలు, ప్రత్యేక దర్శనాలకు గంట సమయం పట్టిందని భక్తులు తెలిపారు. కొండకింద పాత గోశాలలోని వ్రత మండపంలో సత్యనారాయణస్వామి వ్రతపూజల్లో యాత్రీకులు కుటుంబసమేతంగా పాల్గొని మొక్కు చెల్లించుకున్నారు. స్వామికి వేకువజామునే సుప్రభాతంతో నిత్య పూజలు ఆరంభించిన ఆచార్యులు, బాలాలయంలో ఉత్సవమూర్తులను అభిషేకించి తులసీదళాలతో అర్చించారు. 

Updated Date - 2022-02-21T01:51:52+05:30 IST