యాదాద్రి: ప్రభుత్వ పాఠశాలలో పాడు పనులు

ABN , First Publish Date - 2021-08-26T18:33:26+05:30 IST

యాదాద్రి సమీపంలో ఆకతాయిలు రెచ్చిపోయారు. బడిలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడ్డారు.

యాదాద్రి: ప్రభుత్వ పాఠశాలలో పాడు పనులు

భువనగిరి జిల్లా: యాదాద్రి సమీపంలో ఆకతాయిలు రెచ్చిపోయారు. బడిలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడ్డారు. ప్రభుత్వ పాఠశాలను బారు, లాడ్జీగా మార్చేసి పాడుపనులకు తెగబడ్డారు. సెప్టెంబర్ 1 నుంచి స్కూల్స్ పునఃప్రారంభం సందర్భంగా ఆకతాయిల నిర్వాకం, అధికారుల నిర్లక్ష్యం రెండూ బయటపడ్డాయి.


యాదిగిరిగుట్ట ప్రభుత్వ పాఠశాలను అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మార్చారు. ఇన్ని రోజులు కరోనా కారణంగా పాఠశాలలు మూతబడడంతో ఈ గదులు మందుబాబులు, ఆకతాయిలకు అడ్డాగా మారాయి. రాత్రి, పగలు అనే తేడా లేకుండా మందుకొట్టి,  అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. సెప్టెంబర్ 1 నుంచి స్కూల్స్ పునఃప్రారంభించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో ఆకతాయిలు, మందుబాబుల బాగోతం బయటపడింది. ఎక్కడ చూసినా మందు సీసాలు, సిగరెట్ ప్యాకెట్స్, కండోమ్‌లు ఉన్నాయి. కొద్ది రోజులుగా యాదాద్రి పుణ్య క్షేత్రం వద్ద లాడ్జిలపై పోలీసులు నిఘా పెంచడంతో కొందరు ప్రభుత్వ పాఠశాలలను ఎంచుకున్నట్లుగా సమాచారం. పాఠశాలలో పాడుపనులకు పాల్పడ్డవారిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

Updated Date - 2021-08-26T18:33:26+05:30 IST