తెలంగాణలో షామీ టీవీ ప్లాంట్‌

ABN , First Publish Date - 2021-02-26T09:48:19+05:30 IST

భారత్‌లో మొబైళ్ల తయారీకి మరో రెండు, స్మార్ట్‌ టీవీల తయారీకి మరొక ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తున్న ట్లు చైనా స్మార్ట్‌ఫోన్‌ కంపెనీ షామీ ప్రకటించింది.

తెలంగాణలో షామీ టీవీ ప్లాంట్‌

హైదరాబాద్‌ కంపెనీ రేడియంట్‌తో కలిసి ఏర్పాటు 

షామీ ఇండియా హెడ్‌ మను జైన్‌ వెల్లడి

 

న్యూఢిల్లీ: భారత్‌లో మొబైళ్ల తయారీకి మరో రెండు, స్మార్ట్‌ టీవీల తయారీకి మరొక ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తున్న ట్లు చైనా స్మార్ట్‌ఫోన్‌ కంపెనీ షామీ ప్రకటించింది. తద్వారా భారత్‌లో కంపెనీ విక్రయించే ఫోన్లలో 99 శాతం, టీవీలు 100 శాతం దేశీయంగానే తయారు కానున్నాయని షామీ ఇండియా హెడ్‌, గ్లోబల్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ మను జైన్‌ తెలిపారు. భారత్‌ నుంచి ఎగుమతులు పెంచుకునే ప్రయత్నాల్లో ఉన్నామన్నారు. కంపెనీ భారత్‌ నుంచి బంగ్లాదేశ్‌, నేపాల్‌కు ఎగుమతులను గత ఏడాది ప్రారంభించింది. కొత్త మొబైల్‌ ప్లాంట్లలో ఒకటి ఇప్పటికే ఏర్పాటైందని, ఉత్పత్తి కూడా ప్రారంభమైందని జైన్‌ తెలిపారు. కంపెనీ ఈ ప్లాంట్‌ను డీబీజీ ఇండియా భాగస్వామ్యంలో హరియాణాలో ఏర్పాటు చేసింది. చైనాకు చెందిన ఎలకా్ట్రనిక్స్‌ తయారీదారు బీవైడీతో కలిసి తమిళనాడులో మరో మొబైల్‌ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన చెప్పారు.


టీవీ తయారీ ప్లాంట్‌ను తెలంగాణలో ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. హైదరాబాద్‌కు చెందిన టెలివిజన్‌ తయారీ కంపెనీ రేడియంట్‌తో కలిసి ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తోంది. షామీకి తమిళనాడులో ఇప్పటికే రెండు మొబైల్‌ తయారీ ప్లాంట్లు ఉన్నాయి. ఒకటి ఫాక్స్‌కాన్‌, మరొకటి ఫ్లెక్స్‌ నడుపుతోంది. అలాగే, డిక్సన్‌ టెక్నాలజీ్‌సతో కలిసి ఆంధ్రప్రదేశ్‌లో టీవీల తయారీ ప్లాంట్‌నూ ఏర్పాటు చేసుకుంది. 

Updated Date - 2021-02-26T09:48:19+05:30 IST