సరికొత్త ఫోల్డబుల్ డిజైన్‌కు పేటెంట్ చేసుకున్న షావోమీ

ABN , First Publish Date - 2020-05-26T00:04:56+05:30 IST

ఇప్పటివరకు శాంసంగ్ ఫోల్డబుల్ ఫోన్లను, మోటరోలా ఫోల్టబుల్ ఫోన్లను చూశాం. ఇప్పుడు షావోమీ కూడా ఈ జాబితాలో...

సరికొత్త ఫోల్డబుల్ డిజైన్‌కు పేటెంట్ చేసుకున్న షావోమీ

న్యూఢిల్లీ: ఇప్పటివరకు శాంసంగ్ ఫోల్డబుల్ ఫోన్లను, మోటరోలా ఫోల్టబుల్ ఫోన్లను చూశాం. ఇప్పుడు షావోమీ కూడా ఈ జాబితాలో చేరనున్నట్లు తెలుస్తోంది. కొత్తగా ఓ ఫోల్డబుల్ డిజైన్‌కు సంబంధించి షోవోమీ పేటెంట్ హక్కులు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ డిజైన్‌కు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు షావోమీ వెబ్‌సైట్‌లో దర్శనమిసతున్నాయి. క్లామ్‌షెల్(ముడుచుకునే విధానంతో ఉన్న) డిస్ప్లేతో, రోటేటింగ్ కెమెరాలతో అదిరిపోయేలా దీని డిజైన్ ఉంది. శాంసంగ్ ఫోన్ తరహాలో ఫోల్డింగ్ లాక్స్ కూడా ఈ మోబైల్ కనిపించవని షావోమీ చెబుతోంది. ఇదిలా ఉంటే ఇప్పటివరకు శాంసంగ్ జడ్ ఫ్లిప్ పేరుతో ఫోల్డబుల్ ఫోన్‌ను పరిచయం చేసింది. మోటరోలా మోటో రేజర్ పేరుతో పరిచయం చేసింది. అయితే వీటి ధరలు చాలా ఎక్కువగా ఉన్నాయి. మరి షావోమీ రూపొందిస్తున్న ఈ ఫోన్‌ను మార్కెట్లోకి ఎంత ధరకు తీసుకొస్తుందో వేచి చూడాలి.

Updated Date - 2020-05-26T00:04:56+05:30 IST