షావోమీ మిజియా గ్లాసెస్‌

ABN , First Publish Date - 2022-08-06T06:02:56+05:30 IST

షావోమీ మిజియా గ్లాసెస్‌ను చైనా కంపెనీ ఆరంభించింది. క్రౌడ్‌ఫండింగ్‌ కోసం షావోమీయూపిన్‌ వెబ్‌సైట్‌లో గ్లాసెస్‌ లిస్ట్‌ అయ్యాయి. వెబ్‌సైట్‌లో తెలిపిన ప్రకారం వీటికి 50 మెగా పిక్సెల్‌ క్వాడ్‌-బయర్‌ ..

షావోమీ మిజియా గ్లాసెస్‌

షావోమీ మిజియా గ్లాసెస్‌ను చైనా కంపెనీ ఆరంభించింది. క్రౌడ్‌ఫండింగ్‌ కోసం షావోమీయూపిన్‌ వెబ్‌సైట్‌లో గ్లాసెస్‌ లిస్ట్‌ అయ్యాయి.  వెబ్‌సైట్‌లో తెలిపిన ప్రకారం వీటికి 50 మెగా పిక్సెల్‌ క్వాడ్‌-బయర్‌ ఫోర్‌ ఇన్‌ వన్‌ వైడ్‌ యాంగిల్‌ కెమెరా, 8 మెగాపిక్సెల్‌ పెరిస్కోప్‌ టెలిఫోటో కెమెరా అదీ స్ప్లిట్‌ ఆప్టికల్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌(ఓఐఎస్‌) ఉన్నాయి. గ్లాసెస్‌ బరువు వంద గ్రాములు కాగా 5ఎక్స్‌ ఆప్టికల్‌ జూమ్‌, 15ఎక్స్‌ ఆప్టికల్‌ జూమ్‌ని ఆఫర్‌ చేస్తోంది. అర్హులైన కస్టమర్లు వెబ్‌సైట్‌ నుంచి రిజర్వేషన్‌ చేసుకోవచ్చు. రేట్ల వివరాలు వెబ్‌సైట్‌లో లేవు. అయితే స్పారోన్యూస్‌ ప్రకారం రమారమి దీని ధర రూ.31,500 ఉండొచ్చు. క్రౌడ్‌ ఫండింగ్‌ కాలంలో రూ.29,200కి లభ్యం కావచ్చు. 

Updated Date - 2022-08-06T06:02:56+05:30 IST