కరోనా కలకలం: ప్రపంచ దేశాలకు చైనా కీలక సూచన!

ABN , First Publish Date - 2020-03-27T03:54:54+05:30 IST

చైనా అధ్యక్షుడు జీ జింగ్‌పింగ్ ప్రపంచ దేశాలకు కీలక సూచన చేశారు. దేశాలన్నీ ఒక్కతాటిపై వచ్చి తమ శక్తియుక్తులకు ఏకం చేయాలని పిలుపు నిచ్చారు. ప్రపంచం ఆర్థిక మాంద్యంలోకి జారీపోకుండా ఉండేందుకు అవసరమైన ఆర్థిక విధానాలను సంయుక్తంగా అమలు చేయాలని సూచించారు.

కరోనా కలకలం: ప్రపంచ దేశాలకు చైనా కీలక సూచన!

బీజింగ్: ప్రపంచాన్ని కరోనా మహమ్మారి పట్టి పీడిస్తోంది. ఓ వైపు కరోనా ఎప్పటికి లొంగుతుందో తెలినీ అనిశ్చితి.. మరోవైపు భయపెడుతున్న ఆర్థిక మాంద్యం.. ఈ రెండూ ప్రపంచ దేశాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో చైనా అధ్యక్షుడు జీ జింగ్‌పింగ్ ప్రపంచ దేశాలకు కీలక సూచన చేశారు. దేశాలన్నీ ఒక్కతాటిపై వచ్చి తమ శక్తియుక్తులకు ఏకం చేయాలని పిలుపు నిచ్చారు. ప్రపంచం ఆర్థిక మాంద్యంలోకి జారీపోకుండా ఉండేందుకు అవసరమైన ఆర్థిక విధానాలను సంయుక్తంగా అమలు చేయాలని సూచించారు. ప్రపంచ వ్యాప్తంగా విస్తరించిన సప్లై చెయిన్ల సుస్థిరతను కాపాడాలని కూడా కోరారు. వీడియో కాన్ఫరెన్సు ద్వారా జీ20 సమావేశాల్లో పాల్గొన్న జీ ఈ మేరకు వ్యాఖ్యానించారు. టారిఫ్‌లను తగ్గించి వాణిజ్యానికి ఎదురవుతున్న అడ్డుగొడలను తొలగించాలని ప్రపంచ దేశాలకు పిలుపు నిచ్చారు. తన వంతు బాధ్యతగా చైనా..  దిగుమతులు పెంచడంతో పాటూ విదేశీ పెట్టుబడులను పెంచుతుందని తెలిపారు. 


Updated Date - 2020-03-27T03:54:54+05:30 IST