నియోకోవ్ కొత్త రకం Coronavirusతో మరణాలు అధికం

ABN , First Publish Date - 2022-01-28T15:53:38+05:30 IST

దక్షిణాఫ్రికా దేశంలో వెలుగుచూసిన నియోకోవ్ కొత్త కరోనా వైరస్ వల్ల అధిక మరణాలు సంభవిస్తాయని...

నియోకోవ్ కొత్త రకం Coronavirusతో మరణాలు అధికం

వుహాన్ శాస్త్రవేత్తల బృందం హెచ్చరిక

వుహాన్ (చైనా): దక్షిణాఫ్రికా దేశంలో వెలుగుచూసిన నియోకోవ్ కొత్త కరోనా వైరస్ వల్ల అధిక మరణాలు సంభవిస్తాయని వుహాన్ శాస్త్రవేత్తలు హెచ్చరించారు. నియో కోవ్ కొత్త కరోనా వైరస్ సంక్రమణ రేటు కూడా అధికంగానే ఉంటుందని చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్‌కు చెందిన వుహాన్ యూనివర్శిటీ, ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బయోఫిజిక్స్ శాస్త్రవేత్తలు వెల్లడించారు.నియోకోవ్ వైరస్ మొదట దక్షిణాఫ్రికాలో గబ్బిలాల్లో కనుగొన్నారు. జంతువుల ద్వారా ఈ వైరస్ మనుషులకు సంక్రమించిందని వుహాన్ శాస్త్రవేత్తల అధ్యయనంలో తేలింది.


నియోకోవ్ వైరస్ సోకిన ముగ్గురిలో ఒకరు మరణిస్తారని, ఈ కొత్త రకం వైరస్ కు అధిక ప్రసార రేటు ఉందని స్పుత్నిక్ వుహాన్ శాస్త్రవేత్తలు చెప్పారు. ఈ కొత్త వైరస్ పై చైనా జరిపిన పరిశోధనల గురించి తమకు తెలుసని రష్యన్ స్టేట్ రీసెర్చ్ సెంటర్ ఆఫ్ వైరాలజీ అండ్ బయోటెక్నాలజీకి చెందిన పరిశోధకులు చెప్పారు. 


Updated Date - 2022-01-28T15:53:38+05:30 IST