Oct 20 2021 @ 03:47AM

అందులో తప్పేముంది?

కథానాయిక ప్రాధాన్య పాత్రలతో బాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక మైన అభిమానగణాన్ని సంపాదించుకున్నారు తాప్సీ పన్ను. ఇటీవల విడుదలైన ‘రష్మీ రాకెట్‌’ చిత్రంలో అథ్లెట్‌గా తాప్సీ నటన ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇటీవలె ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ తనకు నచ్చిన క్రీడాకారులతో అవకాశం లభిస్తే డేటింగ్‌కు సిద్ధం అని  తాప్సీ ప్రకటించారు. అందులో తప్పేముంది అని కూడా ఆమె ప్రశ్నించారు. ‘బ్రిటిష్‌ టెన్నిస్‌ ప్లేయర్‌ ఆండీ ముర్రే నాకిష్టమైన టెన్నిస్‌ ఆటగాడు. అతనితో డేటింగ్‌కు అవకాశం వస్తే వదులుకోను’’ అని తాప్సీ చెప్పారు.  సినీనటులతో డేటింగ్‌ తనకు ఇష్టంలేదని గతంలో తాప్సీ ఓ సందర్భంలో తెలిపారు.