రైతన్నకు తప్పని పెట్రో భారం

ABN , First Publish Date - 2021-06-21T05:30:00+05:30 IST

వ్యవసాయ రంగంలో ఆధునిక యాంత్రీకరణ రావ డంతో అన్నదాతకు పెట్రోలు, డీజల్‌ ధరలు భారంగా మారాయి.

రైతన్నకు తప్పని పెట్రో భారం
వరి నాటేందుకు నారుమడి సిద్ధం చేస్తున్న దృశ్యం

మైలవరం, జూన్‌ 21 : వ్యవసాయ రంగంలో ఆధునిక యాంత్రీకరణ రావ డంతో  అన్నదాతకు పెట్రోలు, డీజల్‌ ధరలు భారంగా మారాయి. గతంలో వ్యవసాయంలో యాంత్రీకరణ పెద్దగా లేకపోవడం ఎడ్లబండ్లతో, వ్యవ సాయ కూలీలతో పనులు చేయిస్తూ పంట సాగు నుంచి దిగుబడి ఇంటికి చేరే వరకు పెట్రోలు, డీజల్‌తో అవసరం ఉండేదికాదు. ప్రస్తుతం పొలంలో దుక్కి దగ్గర నుంచి పంట కోతలు, దిగుబడి ఇంటికి చేర్చే వరకు వ్యవసాయంలో యంత్రాల వాడకం బాగా పెరిగిన విషయం తెలిసిందే. ఇది ఎంతో లాభదాయకమే కాకుండా పంటలు సకాలంలో కోతలు చేపట్టి కూలీలతో రోజుల తరబడి పనులు చేయించుకునే అవసరం లేకుండా పోయింది. దీంతో అన్నదాతలు కూడా పెట్రోలు, డీజల్‌పై ఆధారపడాల్సి వచ్చింది. ఇప్పటికే పెరిగిన పెట్రో ధరలతో ఇబ్బందులు పడుతున్న సామాన్య, మధ్య తరగతి ప్రజలే కాకుండా పట్టెడు అన్నం పెట్టే అన్నదాతలకు కష్టాలు తప్పడంలేదు. వ్యవ సాయోత్ప త్తుల రవాణా పంట సాగు ఖర్చులతో రైతన్న తలలు పట్టుకుంటున్నాడు. మండలంలోని కరమలవా రిపల్లి, చిన్నకొమెర్ల, తదితర పెట్రోల్‌ బంకుల్లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.103.30 దాటగా,  డీజల్‌ ధర సైతం దాంతో పోటీ పడుతూ రూ. 97.30 కు చేరుకుంది. ఇలాంటి తరుణంలో ఆధునిక యంత్ర పరికరాల వాడకం అతి భారంగా తయారైందని రైతులు వాపోతున్నారు.  పొలంలో పంట సాగు కోసం సేద్యాలు, వరికయ్య తయారు, పశువులకు మేత తర లించడం తదితర పనులు ట్రాక్టర్ల ద్వారానే చేయాల్సి వస్తుండడంతో పెరిగిన ఖర్చులతో వ్యవసా యం ఎలా చేయాలంటూ ఆందోళన వ్యక్తం చేస్తు న్నారు. ఒక వైపు పకృతి వైపరీత్యాలు, మరో వైపు గిట్టుబాటు ధరల కష్టాల నడుమ పెట్రో పన్నులు అధికభారమైందని  ప్రభుత్వం స్పందించి వ్యవసా యానికి ఉపశమనం కలిగిం చేలా  పెట్రో ధరలు తగ్గించాలని  రైతులు కోరుతున్నారు.

ధరలు తగ్గిస్తేనే సాగు సాధ్యం

పెట్రోల్‌, డీజల్‌ ధరల ను తగ్గిస్తేనే పం ట సాగుకు వీలుకలు గుతుంది. ఇష్టారాజ్యంగా పెట్రో పన్నులు పెంచితే ఇక రైతుల పరిస్థితి ఏమిటి. అన్ని వర్గా ల ప్రజలపై దీని ప్రభావం స్పష్టంగా పడింది. తక్షణమే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి వారి వాటాల్లో పన్నులు తగ్గించుకుని ధర తగ్గేలా చూడాలి.

- జయరామిరెడ్డి ,  రైతు


ఖర్చులు పెరుగుతాయి

పెట్రో ఉత్పత్తుల ధరలు పెరగడం వల్ల వ్యవసాయానికి అదనపు ఖర్చులు పెరు గుతాయి. ఇప్పటికే ఖరీప్‌ పంట సాగుకు సన్నద్ధమవుతున్న అన్నదాతపై నేరుగా  భారం పడు తుంది. యాంత్రీకరణపైనే రైతులు ఆధారపడుతున్నా రు. డీజల్‌ ధర పెంపును వెంటనే తగ్గించేలా చర్యలు తీసుకోవాలి.

- రామచంద్రారెడ్డి,  రైతు





Updated Date - 2021-06-21T05:30:00+05:30 IST