Srikara Hospitals: ఒక కాలుకు బదులు మరో కాలుకు

ABN , First Publish Date - 2021-07-16T23:30:01+05:30 IST

జిల్లాలోని కాప్రా సర్కిల్ పరిధిలోని ఈసీఐఎల్‌లో గల శ్రీకర హాస్పిటల్స్ నిర్వాకం వెలుగులోకి వచ్చింది. ఒక కాలుకు చేసే ఆపరేషన్‌కు బదులుగా మరో కాలుకు ఆపరేషన్‌‌ను వైద్యులు చేసారు. బాధితుడు స్పృహ

Srikara Hospitals: ఒక కాలుకు బదులు మరో కాలుకు

మేడ్చల్: జిల్లాలోని కాప్రా సర్కిల్ పరిధిలోని ఈసీఐఎల్‌లో గల శ్రీకర హాస్పిటల్స్ నిర్వాకం వెలుగులోకి వచ్చింది. ఒక కాలుకు చేసే ఆపరేషన్‌కు బదులుగా మరో కాలుకు ఆపరేషన్‌‌ను వైద్యులు చేసారు. బాధితుడు స్పృహలోకి వచ్చిన తరువాత ఈ సంఘటన వెలుగు చూసింది. పొరపాటు జరిగింది, తిరిగి మరో కాలుకు చికిత్స చేస్తామని బాధితుడికి హాస్పిటల్ యాజమాన్యం తెలిపింది. తనకు జరిగిన అన్యాయంపై  పోలీసులకు బాధితుడు ఫిర్యాదు  చేశాడు. కుషాయిగూడ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2021-07-16T23:30:01+05:30 IST