పరీక్ష రాస్తున్న అభ్యర్థులు
విశాలాక్షినగర్, నవంబరు 29: సబ్ ఇన్‌స్పెక్టర్ (ఎస్‌ఐ)ల పదోన్నతి కోసం విశాఖ రేంజ్ పరిధి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో అర్హులైన ఏఎస్‌ఐలు, హెడ్ కానిస్టేబుళ్లకు సోమవారం కైలాసగిరిలోని ఆర్మ్‌డ్ రిజర్వ్ కార్యాలయంలో రాత పరీక్ష నిర్వహించారు. మంగళవారం డ్రిల్ పరీక్షను నిర్వహించి ఉత్తీర్ణులైన వారిని సబ్ ఇన్‌స్పెక్టర్ శిక్షణకు పంపిస్తారు. పరీక్షలకు చైర్మన్‌గా రేంజ్ డీఐజీ ఎల్‌కేవీ రంగారావు, మెంబర్లుగా విశాఖ జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు, విజయనగరం పీటీసీ ప్రిన్సిపాల్ టి.ఆనందబాబు వ్యవహరిస్తున్నారు.