Donald Trump: అమెరికా మాజీ అధ్యక్షుడు నాపై అత్యాచారం చేశాడు...

ABN , First Publish Date - 2022-09-21T12:55:58+05:30 IST

అమెరికా మాజీ అధ్యక్షుడు(former U.S. president) డోనాల్డ్ ట్రంప్‌పై(Donald Trump) ఓ రచయిత్రి(Writer) అత్యాచారం ఆరోపణలు చేయడం సంచలనం...

Donald Trump: అమెరికా మాజీ అధ్యక్షుడు నాపై అత్యాచారం చేశాడు...

అమెరికన్ రచయిత్రి సంచలన దావా

వాషింగ్టన్: అమెరికా మాజీ అధ్యక్షుడు(former U.S. president) డోనాల్డ్ ట్రంప్‌పై(Donald Trump) ఓ రచయిత్రి(Writer) అత్యాచారం ఆరోపణలు చేయడం సంచలనం రేపింది.1996వ సంవత్సరంలో మిడ్‌టౌన్ మాన్‌హాటన్‌లోని బెర్గ్‌డార్ఫ్ గుడ్‌మాన్ డిపార్ట్‌మెంట్ స్టోర్‌లోని డ్రెస్సింగ్ రూమ్‌లో(dressing room) ట్రంప్ తనపై అత్యాచారం చేశారని రచయిత్రి ఈ జీన్ కారోల్(Jean Carroll) ఆరోపించారు.ట్రంప్‌పై తన క్లయింట్ అయిన రచయిత్రి  జీన్ కారోల్ కోర్టులో దావా(new lawsuit) వేయాలని యోచిస్తున్నట్లు అమెరికా న్యాయవాది చెప్పారు. 


ట్రంప్ తనపై అత్యాచారం చేయడం వల్ల తాను మానసిక క్షోభను అనుభవించానని అందుకే తాను కోర్టులో దావా వేయాలని భావిస్తున్నట్లు రచయిత్రి చెప్పారు. కాగా కారోల్‌పై తాను అత్యాచారం చేయలేదని ట్రంప్ చెప్పారు. కారోల్ రాసిన పుస్తకాన్ని విక్రయించడానికి తనపై అత్యాచారం క్లెయిమ్‌ను రూపొందించారని ట్రంప్ ఆరోపించారు.ఇప్పటికే ట్రంప్ రహస్య పత్రాలు తీసుకువెళ్లారని కేసు ఎదుర్కొంటున్నారు. కారోల్ తరపు న్యాయవాదులు అత్యాచారం జరిగినప్పుడు కారోల్ ధరించినట్లు పేర్కొన్న దుస్తులతో సరిపోల్చడానికి ట్రంప్ నుంచి డీఎన్ఏ(DNA sample) నమూనాను పొందాలనుకుంటున్నారు.



Updated Date - 2022-09-21T12:55:58+05:30 IST