జీవితచరిత్ర రాయండి ఎమ్వీయార్‌!

ABN , First Publish Date - 2021-07-31T08:00:22+05:30 IST

రాయలసీమ ఉద్యమకారుడిగా, రాజకీయ నాయకుడిగా, రచయితగా, అనువాదకుడిగా విలక్షణ జీవితం గల ఎంవీ రమణారెడ్డి జీవిత చరిత్ర రాస్తే, గొప్ప స్ఫూర్తిదాయకమైన పుస్తకం అవుతుందని శ్వేత మాజీ సంచాలకుడు భూమన్‌ అభిప్రాయపడ్డారు.

జీవితచరిత్ర రాయండి ఎమ్వీయార్‌!

తిరుపతి(విశ్వవిద్యాలయాలు), జూలై 30: రాయలసీమ ఉద్యమకారుడిగా,  రాజకీయ నాయకుడిగా, రచయితగా, అనువాదకుడిగా  విలక్షణ జీవితం గల ఎంవీ రమణారెడ్డి జీవిత చరిత్ర రాస్తే, గొప్ప స్ఫూర్తిదాయకమైన పుస్తకం అవుతుందని శ్వేత మాజీ సంచాలకుడు భూమన్‌ అభిప్రాయపడ్డారు. ఊపిరితిత్తుల సమస్యతో తీవ్ర అనారోగ్యంతో ఉన్న ఎవ్వీఆర్‌ను రచయిత చెరుకూరి సత్యనారాయణ, రాఘవశర్మలతో కలిసి ప్రొద్దుటూరులో శుక్రవారం ఆయన కలిశారు. ఆక్సిజన్‌ సిలిండర్లతో జీవిస్తూ కూడా ఎమ్వీయార్‌ గ్రంథ రచన కొనసాగించడం ఒక అద్భుతమన్నారు. గోర్కీ అమ్మ నవలను తెలుగులోకి అనువదిస్తున్న ఎమ్వీయార్‌ను జీవిత చరిత్ర రాయాల్సిందిగా తాము కోరామని, రాస్తానని ఆయన కూడా హామీ ఇచ్చారని చెప్పారు. రాయలసీమ ఉద్యమ జ్ఞాపకాలను భూమన్‌ ఆయనతో పంచుకున్నారు. ఈ సందర్భంగా శ్రీశ్రీ మహాప్రస్థానం సరికొత్త ప్రత్యేక పుస్తకాన్ని ఆయనకు బహూకరించారు. 

Updated Date - 2021-07-31T08:00:22+05:30 IST