స్థలాల కోసం కుస్తీలు

ABN , First Publish Date - 2020-06-23T10:53:13+05:30 IST

లబ్ధిదారులంతా ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఇళ్ల స్థలాల పంపిణీ గడువు దగ్గరపడుతోంది. పక్షం రోజుల్లో పట్టా లు చేతికందించాల్సి ..

స్థలాల కోసం కుస్తీలు

జిల్లాలో పలుచోట్ల వివాదాలు.. జాబితాల్లోకి అనర్హులంటూ ఆందోళనలు

దళారులదే ఇష్టారాజ్యం.. సొమ్ము నొక్కేసి ఇప్పుడు రాజకీయం.. అధికారులకు తలనొప్పులు


(ఏలూరు-ఆంధ్రజ్యోతి ప్రతినిధి): లబ్ధిదారులంతా ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఇళ్ల స్థలాల పంపిణీ గడువు దగ్గరపడుతోంది. పక్షం రోజుల్లో పట్టా లు చేతికందించాల్సి ఉండగా.. అర్హుల జాబితాలపై ఇప్పటికీ అనేకచోట్ల ధర్నాలు, ఆందోళనలు చోటు చేసుకున్నాయి. ఫలి తంగా ఇళ్ల స్థలాల జాబితాల ప్రకటనలకు ముందే అర్హత, అనర్హతపై తర్జన భర్జనలు జరుగుతున్నాయి. సోమవారం జిల్లాలోని అనేకచోట్ల లబ్ధిదారులు ఆందోళనలు చేశారు. ఇళ్ల స్థలం కావాలంటే చేయి తడపాలని అధికార పార్టీలో కొందరు నేతలు డిమాండ్‌ చేస్తుండటంతో గొడవలు జరుగుతున్నాయి. ఇళ్ల స్థలాల కేటాయింపు ప్రకటన ఎప్పుడు వెలువడిందో..  అప్పుడు మొదలైన భూసేకరణ నుంచి లబ్ధిదారుల ఎంపిక వరకూ వరుసగా వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా దాదాపు లక్షా 65 వేల మంది లబ్ధిదారులకు స్థలా లను కేటాయించేందుకు ముందుగా నిర్ణయించారు.


ఈ మేర కు జిల్లా కలెక్టర్‌ ముత్యాలరాజు చొరవతో మండలాల వారీగా రికార్డు సమయంలో భూసేకరణ జరిగింది. లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలంటే దాదాపు నాలుగు వేల ఎకరాలు అవసరమని లెక్కకట్టారు. ఇందుకు ప్రభుత్వ భూమి మినహా, ప్రైవేటు భూమి కొనుగోలుకు దాదాపు రూ.1200 కోట్లు అవుతుందని అప్పట్లో అంచనా వేశారు. ముందుగా ప్రభుత్వ భూములను సిద్ధం చేశారు. అప్పటికే పరుల ఆధీనంలో ఉన్న ప్రభుత్వ భూములను స్వాధీనపర్చుకున్నారు. కొన్నిచోట్ల అధి కార పార్టీ నేతలు తొలుత ఒత్తిళ్లు చేసినా.. ఆ తర్వాత శాంతిం చడంతో ప్రభుత్వ భూముల్లో లేఅవుట్లకు సిద్ధపడ్డారు. ఈ మధ్యకాలంలో లబ్ధిదారుల సంఖ్య పెరగడంతో మరింత భూమి అవసరం ఏర్పడింది. దాదాపు 200 ఎకరాలకుపైగా సేకరించారు. లబ్ధిదారుల సంఖ్య దాదాపు రెండు లక్షలకు చేరువైంది. జిల్లా కలెక్టర్‌ దగ్గర నుంచి జేసీలు, ఆర్డీవోలు, తహసీల్దార్లు, రెవెన్యూ యంత్రాంగం యావత్తు ఇప్పటికీ తల మునకలైంది. ఇదంతా ఒక దారైతే ఇంకో దారిలో పైరవీకారు లు ప్రవేశించారు. అందిన కాడికి దండుకోవడానికి ప్రయ త్నించారు.


అధికార పార్టీలో కొందరి ప్రోత్సాహంతో విచ్చలవి డిగా వ్యవహరించారు. ఆఖరికి ప్రభుత్వం సేకరించిన భూము ల్లోనూ ఆమ్యామ్యాలకు సిద్ధపడ్డారు. రైతులతో ముందస్తు ఒ ప్పందాలు కుదుర్చుకుని లక్షలు నొక్కేసేందుకు సాహసిం చారు. ఇదంతా ఇప్పటి వరకు జరిగిన సీన్‌. ఈ మధ్యనే గడు వు దగ్గరపడుతున్న కొద్దీ అనర్హులను పెద్ద సంఖ్యలో జాబితా ల్లో చేరుస్తున్నారంటూ సరికొత్త వివాదం ఆరంభమైంది. జిల్లా లోని చాలా మండలాల్లో ఈ తరహా వివాదాలే వెలుగులోకి వస్తున్నాయి. స్థానిక నేతలు సామాజికవర్గాల వారీగా విడిపోయి తమ సామాజిక వర్గానికి చెందిన వారికే స్థలాలు దక్కాలనే విధంగా ఆందోళనకు ప్రోత్సహిస్తున్నారు. 


ఇప్పుడు జాబితానే అసలు తంటా

జంగారెడ్డిగూడెంలో కొందరు రైతులు తమకు లోపాయి కారిగా ప్రభుత్వపరంగా వేసిన లే అవుట్లలో మూడు, నాలుగు ప్లాట్లు ఇచ్చేందుకు భూసేకరణ సందర్భంలోనే ఒప్పందం కుది రిందని, ఇప్పుడు దానిని ఉల్లంఘిస్తున్నారంటూ ఫిర్యాదుతో వీధికెక్కారు. ఇక్కడ రైతులు ఇష్టపూర్వకంగానే భూముల విక్ర యానికి సిద్ధపడగా దీంట్లో దళారులు కొందరు అప్పట్లోనే కొంత కమీషన్‌కు కక్కుర్తిపడ్డారు. ఎకరానికి సరాసరిన ఇంత మొత్తంలో అధికారులకు చెల్లించాలంటూ కూడబలుక్కుని మరీ పోగేశారు. ఆ తరువాత నేరుగానే నొక్కేశారు. ఇది జరిగి చాలా కాలమైంది. తాజాగా లబ్ధిదారుల పేరిట డ్రా తీయడం, ఇతరత్రా సమీక్షలు జరుగుతున్న తరుణంలో తమకు కేటా యించాలన్న మూడు, నాలుగు ప్లాట్లు ఏమయ్యాయంటూ నిలదీస్తున్నారు.


వీరంతా కలిసి అధికార పార్టీ నేతకు ఫిర్యాదు చేశారు. మరోవైపు డెల్టాలోనూ, ఏజెన్సీలోనూ లబ్ధిదారుల ఎం పికపై అనేకమంది అనుమానాలు వ్యక్తం చేస్తుండగా, ఒక ఊరులో కేటాయించాల్సిన భూములకు బదులుగా పొరుగు గ్రామంలో కేటాయించడంపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నా రు. ప్రత్యక్షంగా ఆందోళనకు దిగుతున్నారు. నేలపోగులలో లబ్ధిదారులకు పొరుగు గ్రామంలో ఇళ్ల స్థలాలకు రంగం సిద్ధం చేశారు. అప్రమత్తమైన స్థానికులు ఇళ్ల స్థలాలు సొంత ఊళ్ల లోనే ఉండాలే తప్ప పొరుగూరిలో ఏమిటంటూ నిలదీశారు. వీరిని సర్దుబాటు చేసేందుకు అధికారులు ముప్పుతిప్పలు పడుతున్నారు. వీరవాసరం మండలం పెదపేటలో ఖాళీగావు న్న స్థలంలో 20 మందికి కేటాయించాలని నిర్ణయించారు. మి గిలిన వారందరికీ వేరే ప్రాంతాల్లో కేటాయిస్తామని అధికారు లు నచ్చచెబుతున్నా తమకు ఆ ప్రాంతంలోనే కేటాయించా లంటూ ఇప్పుడు కొందరు రగడ సృష్టిస్తున్నారు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వారందరినీ శాంతింపజేసేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నారు. పశివేదలలోనూ ఇళ్ల స్థలాల పంచా యితీ నడుస్తోంది. 


ఈ గ్రామంలో లబ్ధిదారులకు ఇళ్ల స్థలాల నిమిత్తం ఆరెకరాలు అవసరం కాగా ఈ మధ్యనే వాటిలో దాదాపు 53 సెంట్లు కొనుగోలుకు అందుబాటులో లేదని అధి కారులు తేల్చారు. లబ్ధిదారుల ఎంపికకు ముందే ఈ తతం గమంతా సాగింది. ఎట్టి పరిస్థితుల్లోనూ అవసరమైన భూమి ని సమకూరుస్తామని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వాదిస్తున్నా అనర్హులైన వారిని ప్రత్యేకం జాబితాలో చేరుస్తు న్నారని స్థానికులు మండిపడుతున్నారు. ఇలా వరుసగా అనేక మండలాల్లో ఏదొక వివాదం పరిష్కరించేందుకు వైసీపీ పెద్దలు అక్కడక్కడ ప్రయత్నిస్తూనే ఉన్నారు. అనువుగాని స్థలాలను పేదలకు కేటాయించేందుకు ప్రభుత్వం సిద్ధపడు తోందని ప్రతిపక్షాలు దుయ్యబడుతున్నా.. వీటిని బేఖాతరు చేయడం లేదు.

Updated Date - 2020-06-23T10:53:13+05:30 IST