Abn logo
Aug 4 2021 @ 10:51AM

Tokyo Olympics: సెమీస్ చేరిన దహియా, దీపక్ పూనియా

టోక్యో: విశ్వక్రీడలు ఒలింపిక్స్‌లో పురుషుల రెజ్లింగ్‌లో భారత రెజ్లర్లు రవికుమార్ దహియా, దీపక్ పూనియా దుమ్మురేపారు. ఇవాళ జరిగిన క్వార్టర్ ఫైనల్స్‌లో ఈ ఇద్దరు తమ ప్రత్యర్థులను మట్టికరిపించి సెమీస్‌కు దూసుకెళ్లారు. పురుషుల 87 కిలోల విభాగంలో దీపక్ పూనియా చైనీస్ రెజ్లర్‌ లిన్ జుషెన్ పై 6-3 తేడాతో గెలిచి సెమీ ఫైనల్ చేరాడు. అటు రవికుమార్ దహియా పురుషుల 57 కిలోల విభాగంలో బల్గేరియాకు చెందిన రెజ్లర్‌ జార్జి వాంగెలోవ్‌పై 14-4 తేడాతో భారీ విజయం నమోదు చేశాడు. దీంతో ఈ ఇద్దరు భారత రెజర్లు ఇప్పుడు పతకానికి కేవలం ఒక్క అడుగు దూరంలో ఉన్నారు.