బర్మింగ్‌హామ్: కామన్వెల్త్ గేమ్స్ (Commonwealth Games) 8వ రోజున భారత్ మరికొన్ని పతకాలను ఖాయం చేసుకుంది. రెజ్లింగ్ 65 కేజీల పురుషుల విభాగంలో బజరంగ్ పూనియా (Bajrang Punia), మహిళల 62 కేజీల విభాగంలో సాక్షి మాలిక్ (Sakshi Malik), మహిళల 57 కేజీల విభాగంలో అన్షు మాలిక్ (Anshu Malik) ఫైనల్స్‌కు చేరుకుని పతకాలు ఖాయం చేసుకున్నారు. మోహిత్ గ్రెవాల్ (పురుషుల 125 కేజీలు), దీపక్ పునియా (పురుషుల 86 కేజీలు) సెమీఫైనల్స్‌కు చేరుకున్నారు. భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్‌కు చేరుకోగా, కిడాంబి శ్రీకాంత్ పురుషుల సింగిల్స్ క్వార్ట్స్‌లో ప్రవేశించాడు.
మహిళల సింగిల్స్ పారా టేబుల్ టెన్నిస్ క్లాసెస్ 3-5లో భవీనాబెన్ పటేల్ ఫైనల్‌కు చేరుకుంది. మనీకా బాత్రా, సాథియన్ జ్ఞానశేఖరన్ టేబుల్ టెన్నిస్ మిక్సడ్ డబుల్స్‌లో క్వార్టర్ ఫైనల్స్‌కు చేరుకున్నారు. మరో స్టార్ టీటీ ప్లేయర్ ఆచంట శరత్ కమల్ పురుషుల సింగిల్స్‌లో రౌండ్ ఆఫ్ 16కి చేరుకున్నాడు.
ఇవి కూడా చదవండి