టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొనేందుకు రెజ్లర్ సుమిత్ మాలిక్ అర్హత

ABN , First Publish Date - 2021-05-07T14:55:49+05:30 IST

భారత రెజ్లర్ సుమిత్ మాలిక్ టోక్యో ఒలింపిక్స్ కు అర్హత సాధించారు....

టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొనేందుకు రెజ్లర్ సుమిత్ మాలిక్ అర్హత

సోఫియా (బల్గేరియా): భారత రెజ్లర్ సుమిత్ మాలిక్ టోక్యో  ఒలింపిక్స్ కు అర్హత సాధించారు. 125 కిలోల రెజ్లింగ్ కేటగిరిలో సుమిత్ పాల్గొననున్నారు. బల్గేరియాలోని సోఫియాలో తాజాగా జరిగిన వరల్డ్ రెజ్లింగ్ క్వాలిఫయ్యర్ పోటీల్లో సుమిత్ పాల్గొని అర్హత సాధించారు. టోక్యో ఒలింపిక్స్ లో పాల్గొనేందుకు అర్హత పొందిన క్రీడాకారుల్లో సుమిత్ నాల్గవ క్రీడాకారుడు. అంతర్జాతీయ ఒలింపిక్స్ కమిటీ క్రీడాకారులకు వ్యాక్సిన్ అందించేలా ఫిజర్, బయో ఎన్ టెక్ ఎస్ఈ కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకుంది. టోక్యో ఒలింపిక్స్ ఈ ఏడాది జులైలో జపాన్‌లోనే నిర్వహించాలనుకున్నారు. అయితే ఈ ఏడాది సైతం ఈ టోర్నీకి ముప్పు తప్పేలా లేదు. ప్రస్తుతం జపాన్ నగరాల్లో కోవిడ్ ఉద్ధృతి తీవ్రంగా ఉంది. కేసులు పెరుగుతుండడంతో జపాన్ ప్రభుత్వం దేశంలో అత్యయిక స్థితిని విధించింది. 

Updated Date - 2021-05-07T14:55:49+05:30 IST