ఆర్ఎస్ఎస్‌పై రఘురాం రాజన్ ఘాటు వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2021-09-15T21:26:36+05:30 IST

వస్తుసేవల పన్ను (జీఎస్‌టీ)ని ఆయన పూర్తిగా తప్పు పట్టకుండానే ప్రభుత్వంపై పదునైన విమర్శలు చేశారు. ‘‘జీఎస్టీ అమలు విధానం అద్భుతంగా ఉందని నేను అనుకోవడం లేదు. వాస్తవానికి దీన్ని మరింత బాగా తయారు చేయొచ్చు..

ఆర్ఎస్ఎస్‌పై రఘురాం రాజన్ ఘాటు వ్యాఖ్యలు

న్యూఢిల్లీ: ఇన్ఫోసిస్‌ను దేశద్రోహ శక్తులు అంటూ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్‌(ఆర్ఎస్ఎస్)కు చెందిన పాంచజన్య అనే మ్యాగజైన్ చేసిన వ్యాఖ్యలపై ఆర్‌బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్ ఘాటు స్పందించారు. దేశంలో వ్యాక్సినేషన్ సరిగా నిర్వర్తించలేకపోతున్న ప్రభుత్వాన్ని దేశద్రోహి అనగలరా అంటూ ఆయన ప్రశ్నించారు. బుధవారం ఓ జాతీయ న్యూస్ చానల్‌తో పాంచజన్య వ్యాఖ్యలు పూర్తిగా నిరుపయోగమని ఆయన అన్నారు. వ్యాక్సినేషన్‌లో ప్రభుత్వం చాలా లోపాయికారిగా ఉందని, దాన్ని సవరించుకోవాల్సిన అవసరం ఉందని రఘురాం రాజన్ సూచించారు.


వస్తుసేవల పన్ను (జీఎస్‌టీ)ని ఆయన పూర్తిగా తప్పు పట్టకుండానే ప్రభుత్వంపై పదునైన విమర్శలు చేశారు. ‘‘జీఎస్టీ అమలు విధానం అద్భుతంగా ఉందని నేను అనుకోవడం లేదు. వాస్తవానికి దీన్ని మరింత బాగా తయారు చేయొచ్చు. కానీ ఇప్పటికి జరిగిన తప్పుల నుంచి ప్రభుత్వం ఏమాత్రం నేర్చుకోవడం లేదు. తమ సొంత పక్షపాతాలను వాడుకోవడానికి అది వేదిక కాకూడదు’’ అని రఘురాం రాజన్ అన్నారు. ఆర్థిక విధానాల్లో ప్రభుత్వం ఇంకా పురోగతి చెందాల్సిన అవసరం ఉందని ఆయన నొక్కి చెప్పారు.

Updated Date - 2021-09-15T21:26:36+05:30 IST