అధ్వాన రహదారులు.. ప్రజల అవస్థలు

ABN , First Publish Date - 2020-10-01T08:34:47+05:30 IST

యెంట్రుకోన నుంచి అల్లవరం మీదుగా గోపాయిలంక వెళ్లే రోడ్డు పలుచోట్ల కుంగిపోయి అధ్వా నంగా తయారైంది.

అధ్వాన రహదారులు.. ప్రజల అవస్థలు

అల్లవరం, సెప్టెంబరు 30: యెంట్రుకోన నుంచి అల్లవరం మీదుగా గోపాయిలంక వెళ్లే రోడ్డు పలుచోట్ల కుంగిపోయి అధ్వా నంగా తయారైంది. ఈటివారిపాలెం సమీపాన 80మీటర్ల పొడవున, నాలుగు మీటర్ల వెడల్పున, రెండు అడుగుల లోతున పంట కాల్వ వైపు రోడ్డు దిగబడి అత్యంత ప్రమాదకరంగా ఉంది. 2019 నవం బరులో రూ.1.50కోట్ల నిధులతో ఈరోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసినా ఇప్పటి వరకు పనులు ప్రారంభించక పోవడంపై అధికారుల తీరును ప్రజలు విమర్శిస్తున్నారు.


రాష్ట్రమంత్రి పినిపే విశ్వరూప్‌, ఎంపీ చింతా అనురాధల సమక్షంలో రోడ్డు నిర్మాణానికి శంకు స్థాపన చేసిన శిలాఫలకం సాక్ష్యంగా నిలిచింది. ఈరోడ్డు అడుగ డుగునా పెద్దపెద్ద గోతులతో అధ్వానంగా మారింది. దీంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. శంకుస్థాపన చేసి ఏడాది కావ స్తున్నా ఈరోడ్డు అభివృద్ధిని ఎందుకు పట్టించుకోవడం లేదని పలు గ్రామాల ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా పంచాయతీరాజ్‌ అధి కారులు ఈరోడ్డును అభివృద్ధి చేయాలని ప్రజలు కోరుతున్నారు. 

  


బి.దొడ్డవరం - పెదపట్నంలంక రోడ్డు అధ్వానం


మామిడికుదురు, సెప్టెంబరు 30: బి.దొడ్డవరం గ్రామం నుంచి పెదపట్నంలంక వెళ్లే ఆర్‌అండ్‌బీ రహదారి అధ్వానంగా ఉంది. దీంతో రెండు గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. బి.దొడ్డ వరం నుంచి పెదపట్నంలంక వరకు  రహదారి అంతా గోతులు పడి రాళ్లు లేచిపోయి ప్రమాదాలకు నిలయంగా తయారైం దని ఆయా గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు. ఏళ్ల తరబడి సమస్య ఉన్నప్పటికీ పాలకులు, అధికారులు స్పందించడంలేదని ఆరోపి స్తున్నారు.


వరదలు వచ్చి వెళుతున్నాయి తప్ప రోడ్డు వేసే నాథుడే కరువయ్యాడని ప్రజలు వాపోతున్నారు. నిత్యం ఈరోడ్డుపై వేల సంఖ్యలో ప్రజలు మామిడికుదురు, పాశర్లపూడి, అమలాపురం తదితర గ్రామాలకు ప్రయాణం చేస్తుంటారు. రోడ్డు అధ్వానంగా ఉండటంతో తరుచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. తాత్కాలిక మరమ్మతులు కాకుండా శాశ్వత రోడ్డును నిర్మించి సమస్యను పరి ష్కరించాలని  ప్రజలు కోరుతున్నారు.



 దాసరివారిపేట వాసుల కష్టాలు


అంబాజీపేట, సెప్టెంబరు 10: ఇసుకపూడి పంచాయతీ పరిధిలోని దాసరివారిపేట ఏర్పడి 50ఏళ్లు గడుస్తున్నా నేటికి అభివృద్ధికి నోచుకోలేదని ఆ పేట వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దాసరివారిపేటలో రోడ్లులేక అవస్థలు పడుతున్నామన్నారు. వర్షాలకు నీరు నిల్వ ఉండి రోగాల బారిన పడుతున్నామన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి దాసరివారిపేట ప్రజల కష్టాలు తీర్చాలని కోరుతున్నారు.  

గోతులు పూడ్చండి

అంబాజీపేట మండలం కె.పెదపూడి హైస్కూల్‌ సమీపంలోని ప్రధాన రహదారి గోతులు పడి అధ్వానంగా ఉంది. వర్షం వస్తే ఈగోతుల్లో మోకాలు లోతు నీరు చేరుతుంది. దీంతో గోతులు కనిపించక పోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి.  ఇటీవల ఆ గోతులో లారీ బోల్తా పడింది. ఒక చిన్నారి గోతులో పడి తీవ్రంగా గాయపడింది. గోతులను పూడ్చాలని ప్రజలు కోరుతున్నారు.



ముక్తేశ్వరం - కె.జగన్నాథపురం రహదారి ఛిద్రం

అయినవిల్లి, సెప్టెంబరు 30: భారీ వర్షాలు, వరదలకు మండ లంలో రహదారులు ఛిద్రమయ్యాయి. ముక్తేశ్వరం నుంచి కె.జగన్నా థపురం వరకు ఆర్‌అండ్‌బీ రహదారి గోతులమయమై ప్రమాదా లకు కారణం అవుతుందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రహదారులను ఆధునికీకరించాలని ప్రజలు కోరుతున్నారు. గోదా వరి వరదల వల్ల లంక గ్రామాల్లో రహదారులు చిద్రమయ్యాయి. 


Updated Date - 2020-10-01T08:34:47+05:30 IST