అధ్వానంగా తారు రోడ్డు

ABN , First Publish Date - 2022-06-30T04:33:46+05:30 IST

గిద్దలూరు మున్సిపాలిటీ పరిధిలోని మోడంపల్లి గ్రామానికి వెళ్లే రహదారి గుంతలతో అధ్వానంగా మారింది. దీంతో వాహనచోదకులు ఇక్కట్లకు గురవుతున్నారు.

అధ్వానంగా తారు రోడ్డు
మోడంపల్లి రోడ్డుపై గుంతలు

గుంతలమయమైన మోడంపల్లి దారి

వాహనచోదకులకు ఇక్కట్లు

పట్టించుకోని పాలకులు

గిద్దలూరు, జూన్‌ 29 : గిద్దలూరు మున్సిపాలిటీ పరిధిలోని మోడంపల్లి గ్రామానికి వెళ్లే రహదారి గుంతలతో అధ్వానంగా మారింది. దీంతో వాహనచోదకులు ఇక్కట్లకు గురవుతున్నారు. అనంతపురం - గుంటూరు జాతీయ రహదారి నుంచి మోడంపల్లి గ్రామానికి వెళ్లే తారురోడ్డుపై చాలా చోట్ల గుంతలు ఏర్పడి రాళ్లు తేలి ఉంది. వర్షం పడితే ఈ రోడ్డులో ఎక్కడ గుంత ఉందో తెలియక వాహనచోదకులు ప్రమాదాల కు గురవుతున్నారు. రాత్రిపూట గుంతలమయమైన రోడ్డుపై ప్రయాణించేవారు ప్రమాదాలబారిన పడు తున్నారు. పాలకులు, అధికారులు స్పందించి ప్రధాన రహదారి నుంచి గ్రామంలోకి వెళ్లే ఈ అధ్వాన రోడ్డును బాగు చేయాలని, ఇరు వైపులా డ్రైనేజీ సౌకర్యాన్ని క ల్పించాలని గ్రామస్థులు కోరుతున్నారు. 

సమస్యలకు నిలయంగా రోలుగుంపాడు 

తర్లుపాడు : మండలంలోని రోలుగుంపాడు సమ స్యలకు నిలయంగా మారింది. గ్రామం లో కనీస  వసతులు లేక పోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతు న్నారు. గ్రామంలో అంతర్గత రోడ్ల దుస్థితి అధ్వానంగా ఉంది. గ్రామంలో ప్రధాన వీధుల్లో కాల్వ కూడా లేకపోవడంతో మురుగు నీరంతా రోడ్లపై నిల్వ ఉండి దుర్గంధం వెదజల్లుతోంది. మంచినీటి ట్యాంక్‌ కూడా శుభ్రం చేయకపోవడంతో పాచి పట్టిన నీరే తాగాల్సిన దుస్థితి ఏ ర్పడిందని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. వారంరోజుల క్రితం గడపగడపకు కార్యక్ర మానికి వచ్చిన ఎ మ్మెల్యే కుందురు నాగార్జున రెడ్డి వద్ద గ్రామస్థులు సమస్యల ఏకరువు పెట్టారు. ఇప్పటికై నా గ్రామంలో క నీస వసతులు క ల్పించాలని, రోడ్లు నిర్మించాలని ప్రజ లు కోరుతున్నారు.




Updated Date - 2022-06-30T04:33:46+05:30 IST