అధ్వానంగా అమరవీరుల పార్కు

ABN , First Publish Date - 2022-06-25T06:18:11+05:30 IST

విధి నిర్వహణలో అసువులు బాసి న పోలీసు అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ పట్టణంలో ఏర్పాటైన పార్కు అధ్వానంగా మారింది.

అధ్వానంగా అమరవీరుల పార్కు
నాడు : రమణీయంగా ఉన్న అమరవీరుల పార్కు

ఎండుతున్న మొక్కలు 

కనుమరుగైన పచ్చదనం


మడకశిర టౌన్‌, జూన 24: విధి నిర్వహణలో అసువులు బాసి న పోలీసు అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ పట్టణంలో ఏర్పాటైన పార్కు అధ్వానంగా మారింది. పోలీసు అమరవీరుల పా ర్కును 2000 సంవత్సరంలో సర్వాంగ సుందరంగా నిర్మించారు. ప్ర తి ఏటా అక్టోబరు 15 నుంచి 22 వరకు అమరవీరుల వారోత్సవాల ను నిర్వహిస్తుంటారు. జిల్లాలో మొట్టమొదటిగా ఈపార్కును ఇక్క డ నిర్మించారు. అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా ఈపార్కులో విద్యార్థులకు పోలీసుల విధులు, బాధ్యతలు, సేవలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తుంటారు. అప్పటి సీఐ చంద్రశేఖర్‌రె డ్డి ప్రత్యేక చొరవతో ఈపార్కును నిర్మించారు. 2001లో అప్పటి ఎస్పీ అంజనాసిన్హా ఈ పార్కును ప్రారంభించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతియేడు అక్టోబరు 21న పోలీసు అమరవీరుల దినోత్సవా న్ని ఆపార్కులో జరుపుకుంటూ వస్తున్నారు. అదేవిధంగా పార్కులో టేకు, కొబ్బరి, జామ, వివిధ రకాల పూల మొక్కలతో నిత్యం కళకళలాడుతూ... మడకశిర అందాన్ని ఈపార్కు మరింత పెంచింది. పా ర్కు చుట్టూ అత్యంత రమణీయమైన వివిద రకాల శిల్పాలను ఉం చారు.


 పిల్లలు ఉల్లాసంగా ఆడుకునేందుకు పార్కు బయట ఊయలలు, ప్రత్యేకంగా బల్లలు ఏర్పాటు చేశారు. దీంతో విద్యార్థులు, పట్టణ వాసులు సాయంత్రం వేళల్లో పార్కులో కూర్చుని సేదతీరుతుంటారు. ప్రస్తుతం పార్కుకు ఆలనాపాలనా కరువైందని పట్టణ ప్రజలు వాపోతున్నారు. నీరు లేక పార్కులోని మొక్కలు ఎండి, ప చ్చదనం కరువైంది. ఇప్పటికైనా అధికారులు చొరవతీసుకుని పా ర్కుకు గత వైభవాన్ని తీసుకురావాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.




Updated Date - 2022-06-25T06:18:11+05:30 IST