Advertisement
Advertisement
Abn logo
Advertisement

మల్లన్న సన్నిధిలో భక్తుల పూజలు

ఓదెల, నవంబరు 28 : జిల్లాలో ప్రసిద్ధి చెందిన భ్రమరాంభ మల్లిఖార్జునస్వామి క్షేత్రంలో ఆదివారం వివిధ జిల్లాల నుంచి వచ్చిన భక్తులు ఘనంగా పూజలు నిర్వ హించారు. వరికోతలు పూర్తి కావస్తున్న సమయంలో ఆలయంలో ప్రతి ఆదివారం భక్తుల రద్దీ పెరుగుతుంది. జిల్లాతో పాటు ఇతర జిల్లాలు, మండలాల నుంచి భక్తులంతా తమ కుటుంబాల వారిగా తరలివచ్చి మల్లికార్జున స్వామిని దర్శిం చుకున్నారు. అలాగే భక్తులు ఆలయంలో బోనాలు, కోడె మొక్కులు, అర్చనలు సమ ర్పించారు. ఒగ్గు పూజారులతో భక్తులు ఈసారి పట్నాలు వేయించి తమ మొక్కులు సమర్పించారు. 

Advertisement
Advertisement