Advertisement
Advertisement
Abn logo
Advertisement

నృసింహుని సన్నిధిలోఽ ప్రముఖుల పూజలు

ధర్మపురి, డిసెంబరు 2: ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయాన్ని రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ చీఫ్‌ ఇంజనీర్‌ సీతారాములు కుటుంబ సభ్యులు గురువారం ఉదయం సందర్శించారు. ఆలయానికి విచ్చేసిన వారికి వేదపండితులు, అర్చకులు, సిబ్బంది మర్యాద పూర్వకంగా స్వాగతం పలికారు. అనంతరం స్వామి సన్నిధిలో వారు ప్రత్యేక పూజలు జరిపారు. ఆలయ వేద పండితులు సామవేద పండితులు ముత్యాలశర్మ తదితర వేద బ్రాహ్మణుల మంత్రోచ్ఛరణల మధ్య ఆలయ ముఖ్య అర్చకులు నంబి శ్రీనివాసాచారి, అర్చకులు వారిని ఘనంగా ఆశీర్వదించారు. ఈవో సంకటాల శ్రీనివాస్‌ వారికి స్వామి శేష వస్త్రం, చిత్రపటం, ప్రసా దాలు బహుకరించి సత్కరించారు. వారి వెంట దేవాదాయ శాఖ ఈఈ రాజేష్‌, ఏఈఈ లక్ష్మణ్‌రావు, ఆలయ సీనియర్‌ అసిస్టెంట్‌ అలువాల శ్రీనివాస్‌, ఆలయ ముఖ్య అర్చకులు నంబి నరసింహమూర్తి, అర్చకులు  పాల్గొన్నారు. 


Advertisement
Advertisement