Abn logo
Sep 26 2021 @ 00:31AM

యాదాద్రీశుడికి వైభవంగా పూజలు

లక్ష్మీనృసింహుల కల్యాణ వేడుకలు నిర్వహిస్తున్న అర్చకులు

యాదాద్రి టౌన్‌, సెప్టెంబరు 25: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రంలో స్వామివారికి నిత్యపూజా కైంకర్యాలు వైభవంగా కొనసాగాయి. బాలాలయంలో కవచమూర్తులు, ఉత్సవమూర్తులకు అభిషేకం, అర్చనలు, హోమం, నిత్య తిరుకల్యాణోత్సవం ఆగమ శాస్త్రరీతిలో నిర్వహించారు. అనుబంధ రామలింగేశ్వరుడికి, క్యూకాంప్లెక్స్‌లోని చరమూర్తులకు శైవాగమ పద్ధతిలో నిత్య పూజలు కొనసాగాయి. కాగా, వారాంతం కావడంతో క్షేత్రంలో భక్తుల కోలాహలం నెలకొంది. సేవా మం డపాలు, దర్శన క్యూలైన్లు కిక్కిరిశాయి. కాగా, భక్తుల నుంచి వివిధ విభాగాల ద్వారా రూ.10,01,568 ఆదాయం సమకూరింది.


శివాలయంలో శివపార్వతుల విగ్రహాలు

యాదాద్రి కొండపై అనుబంధ ఆలయం శివాలయంలో పార్వతీ పరమేశ్వరుల విగ్రహాలను అమర్చుతున్నారు. శివాలయ ప్రవేశ ద్వారంలోని స్వాగత తోరణంలో, రథశాలపై శివపార్వతుల విగ్రహాలను అమర్చారు. ప్రకార మండపాల్లో నంది వాహనంపై కూర్చున్న శివపార్వతుల విగ్రహాలను అమర్చనున్నట్లు శిల్పులు తెలిపారు.